ఉదయము పది గంటలకి సికింద్రాబాద్ పాట్నా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరేము
23 -1 -2011 అలహాబాద్
ఉదయము పదకొండు గంటలకి అలహాబాద్ చేరేము .వెయిటింగ్ రూములో స్నానాలు చేసి క్లోక్ రూములో సామాన్లు పెట్టుకొని రెండు గంటలకి త్రివేణి సంగమం లో స్నానాలు చేయడానికి బయలుదేరేము .పడవలో నది లోపలి వెళ్లేము .అక్కడ సంకల్పము చెప్పుకొని సంగమములో అందరం స్నానాలు చేసాము
అక్కడ నుండి బయలుదేరి రెండు ఆంజనేయస్వామి దేవాలయాలు చూసాము
తరువాత భరద్వాజ ఆశ్రమం చూసాము .
అక్కడనుండి ఒక సౌత్ ఇండియన్ హోటలకు వెళ్లి భోజనము చేసి క్లోక్ రూము లో సామాన్లు తీసుకొని చిత్రకూట్ ట్రైన్ ఎక్కేము .
24 -1 -2011 చిత్రకూట్
తెల్లవారు ఝామున 1 .30 కు చిత్రకూట్ చేరేము . ఐదుగంటల వరకు అక్కడ ఉండి ఆనందాశ్రమము చేరేము. 9 .30 కు స్ఫటిక శిలను చూసాము. అక్కడ రాముడి పాద ముద్రలు చూసాము .
తరువాత రామ దర్శన్ అనే చోటికి వెళ్లేము .
అక్కడనుండి సతి అనసూయ ఆశ్రమానికి బయలుదేరేము .ప్రయాగ లో రాముడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళినపుడు ఆయన వారిని అత్రి మహర్షిని అనసూయను చిత్రకూట్ లో సందర్శించమని చెప్పేరుట .మేము అక్కడికి వెళ్లి మందాకినీ నదిలో స్నానం చేసాము .
తదనంతరం గుప్తగోదావరి చూడడానికి వెళ్లేము .
తరువాత కామదగిరి కి వెళ్లేము .
తరువాత భరతకూప్ హనుమద్దార చూసాము .
ఆశ్రమములో భోజనముచేసి పది గంటలకు చిత్రకూట్ స్టేషన్ కు బయలుదేరేము .
25 -1 -2011
తెల్లవారు ఝాము మూడున్నర గంటలకు లక్నో వెళ్ళే ట్రైన్ ఎక్కేము .ఉదయం 10 .30 కి లక్నో చేరేము . మధ్యాహ్నం 1.00 కి టాక్సీ లో బయలు దేరి తోవలో ఆర్యన్ హోటల్ లో భోజనం చేసాము .సాయంత్రం ఆరు గంటలకి నైమిశారణ్యం చేరాము .విజయవాడ వారు నిర్మించిన బాలాజీ మందిరం ఆశ్రమములో విడిది చేసి స్నానము భోజనము చేసి నిద్రించేము .
26 -1 -2011 నైమిశారాణ్యం
చక్ర తీర్థం
తరువాత వ్యాస గద్ది సూత గద్ది చూశాము .
అటుపిమ్మట లలిత మందిరము , కాళీమఠము , హనుమాన్ గద్ది చూశాము .
బాలాజీ మందిరం
గుడి బయట శిల్పం
12.౦౦ గంటలకు బాలాజీ గుడికి వచ్చి వెంకటేశ్వరస్వామి దర్సనం చేసుకొని టాక్సీ లో ఒంటి గంటకు అయోధ్యకు బయలుదేరాము. రాత్రి 7 .15 కు అయోధ్య చేరాము .గుజరాత్ వారి జానకీ మహల్ లో బస చేశాము . చాల సదుపాయంగా విశాలముగా ఉంది. బయట కోతులు చక్కగా ఆడుకుంటున్నాయి .రాత్రి తొమ్మిది గంటలకు భోజనము చేశాము
.27 -1 -2011 అయోధ్య
ఉదయం ఆరున్నరకి కాఫీ తాగిపావు తక్కువ ఎనిమిదికి సరయూ నదిలో స్నానం చేసాము
నది తీరమ్మున
పురమొక్కటి ఉన్నది కడుపుణ్య ప్రాంత్రం
బరయగ దానిని మించిన
పురమేదియు లేదు నిజము భూభాగమునన్
------శ్రీహరేష్
తొమ్మిది గంటల ప్రాంతం లో రామమందిర్ వర్క్ షాప్ దగ్గరికి వెళ్లేము .
తరువాత రామచంద్ర తీర్థ ఆశ్రమం కి వెళ్లేము .
తరువాత హనుమాన్ గద్ది , కనక్ మహల్ చూశాము .
కనక మహల్
తరువాత పుత్ర కామేష్టి యజ్ఞ శాల రామ జన్మభూమి చూశాము . రామ జన్మభూమి లో ఉన్న సెక్యూరిటీ చెకింగ్ ఎక్కడా చూడ లేదు .పెన్ను , పెన్సిల్ , దువ్వెన కూడా అనుమతించలేదు . ఆ తరువాత బిర్ల మందిర్ కి వెళ్లేము కాని మూసి ఉంది .
బిర్లా మందిరం
అక్కడనుండి బయలుదేరి రాం ఘాట్ , నాగేశ్వరనాథ్ మందిరం చూశాము .
అయోధ్య స్టేషన్
జానకి మహల్ నుండి రెండు గంటలకి బయలు దేరి రెండుంపావుకి అయోధ్య స్టేషన్ చేరుకున్నాము .
మూడున్నరకు గంగ సట్లేజ్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కి రాత్రి ఎనిమిది గంటలకు కాశి చేరుకున్నాము .తొమ్మిది గంటలకు కరివెనవారి సత్రవు చేరుకున్నాము .28 -1 -2011 కాశీ
ఉదయము ఏడున్నరకు గంగా నదిలోస్నానం చేశాము .పదిన్నరకు కాల భైరవుని గుడికి వెళ్లేము . 11 .30 కు అన్నపూర్ణ గుడిలో కుంకుమ పూజకు కూర్చున్నాము .గర్భ గుడిలో అమ్మవారి పాదాలు పట్టుకొనే అవకాశం అందరికి కలిగింది .తరువాత జైపూర్ షాప్ లో రుద్రాక్షలు కొనుక్కున్నాము .మూడు గంటలకు రుద్రాభిషేకం చేసుకున్నాము . ఆ తరువాత విశాలాక్షి అమ్మ వారి గుడిలో పూజ చేసుకున్నాం .ఆరున్నరకు గంగా హారతి చూడడానికి వెళ్లేము . ఫలహారము చేసి రూముకి చేరుకున్నాము .
29 -1 -2011
తెల్లవారు ఝామున ఒంటి గంటకు లేచి స్నానం చేసి రెండు గంటలకు గుడికి బయలుదేరాము .మూడు గంటలకు గుడి తెరిచే సమయం లో చేసే హారతి ఇతర కార్యక్రమాలు చూసే అద్భుతమైన అవకాశం కలిగింది .అక్కడనుండి వారాహి దేవి ఆలయానికి బయలుదేరాము . ఏడాదిలో పదకొండు నెలలు విశాలాక్షి అమ్మవారు క్షేత్ర పాలకురాలిగా మిగత నెల వారాహి దేవి పాలకురాలిగా ఉంటారుట .అక్కడ నుండి సంకటమోచన హనుమాన్ గుడి చేరుకున్నాము .తరువాత దుర్గాదేవి గుడి దర్శించి ఫలహారము చేసి రూముకు చేరుకున్నాము . తొమ్మిది గంటలకు బనారస్ చీరాల షాప్ కి చేరి , పన్నెండు గంటలకు రూం కి చేరి ,కరివెన వారి సత్రము లో భోజనము చేసి మూడున్నరకి స్టేషన్ కి బయలు దేరాము . ఐదుగంటలకు పాట్నా సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ ఎక్కి 30 వ తారీకు రాత్రి పది గంటలకు సికింద్రాబాద్ చేరుకున్నాము .l
సంకట మోచన హనుమాన్
సంకటముల దీర్చు సంకట మోచను
సన్నుతింప నాకు సాధ్యమగునె
బుద్ధి యశము నిచ్చు బుదుడవు నీవెగా
కరుణ చూపవయ్య మరువకయ్య
------ రామకృష్ణ