I Love Free Software

Portable Windows Freeware - CSV

Giveaway of the Day

దోహా–

శ్రీ గురు చరణ సరోజ రజ

నిజమను ముకురు  సుధారి

వరణౌ  రఘువర విమల యశ

జో దాయకు  ఫలచారి ||

ప్రతిపదార్థము

 

శ్రీ గురు  -  గురుదేవుల ; చరణసరోజ  - పాదపద్మాల;

రజ -ధూళి(పరాగము/పుప్పొడిచే);

నిజ – తన ; మను  - హృదయం అనే ; ముకురు - అద్దాన్ని

సుధారి –శుద్ధి చేసుకొని ; వరణౌ -

వర్ణింతును ; రఘువర -రాముని ;

విమల -స్వచ్ఛమైన; యశ - కీర్తిని ;  జో- ఏదైతే ;  చారి - నాలుగు ;

ఫల - ధర్మార్థ కామమోక్షములనెడిఫలములను  ;

దాయకు - ఇచ్చునదియో  ;

తాత్పర్యం

శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరామచంద్రుని స్వఛ్ఛమైన  కీర్తిని నేను వర్ణింతును.

బుద్ధిహీన తను జానికే

సుమిరౌ పవనకుమార్

బల బుధి  బిద్యా దేహు మోహి

హరహు కలేస  బికార్  ||

ప్రతిపదార్థము

 బుద్ధి హీన - బుద్ధిహీనత చేత ; తను - ఈ శరీరము(కలిగినదని) ; జానికే – తెలుసుకొని ; సుమిరౌ – స్మరింతును ; పవనకుమార్  - వాయుపుత్రుని ;  బల - బలమును ; బుధి - బుధ్ధిని ; 

విద్య - జ్ఞానమును ; దేహు - ఇచ్చుగాక ; మోహి - నాకు;

హరహు - తొలగించు గాక ; కలేస -  క్లేశమును ;

బికార -వికారములను ; 

తాత్పర్యం

 నా బుద్ధిహీనతను తెలుసుకొని, వాయునందనుని స్మరింతును. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, కామాది వికారములను తొలగించుగాక .

జయ హనుమాన జ్ఞానగుణ  సాగర |

జయ కపీశ   తిహు లోక ఉజాగర ॥ 1 ॥

ప్రతిపదార్థము

 

జయ - జయము కలుగు గాక ; హనుమాన - ఆంజనేయా;   జ్ఞాన గుణ సాగర -  జ్ఞానము మొదలైన గుణములకు సముద్రము వంటివాడా ; జయ -జయము కలుగు గాక ; కపీశ - వానరులకు నాయకుడవైనవాడా ; తిహులోక  - మూడు లోకములను ; ఉజాగర -

ప్రకాశింప చేయువాడా ;

తాత్పర్యం

 జ్ఞాన గుణ సముద్రుడవయిన ఓ హనుమంతా నీకు జయము కలుగుగాక!   ఓ కపీశ్వర! ముల్లోకాలను ప్రకాశింపజేయువాడా!

నీకు జయము కలుగుగాక!

రామదూత అతులిత బలధామా |

అంజనిపుత్ర పవనసుత నామా ॥ 2 ॥

ప్రతిపదార్థము

రామ దూత – రామదూతా;  అతులిత - సాటిలేని ; బలధామా - బలానికి నిలయం అయినవాడా ; అంజనీ పుత్ర - అంజనీ తనయుడా ;

పవనసుత - వాయుపుత్రుడా ; నామా - ప్రసిధ్ధమైనవాడా ;

తాత్పర్యం

 నీవు శ్రీరామునకు దూతవు, సాటిలేని బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడవు.  పవనసుత అను నామము కలవాడవు.

సుప్రసిద్ధుడవు .

మహావీర విక్రమ బజరంగీ |

కుమతి నివార సుమతి కే సంగీ || 3 ||

ప్రతిపదార్థము

మహావీర - గొప్ప వీరుడా ; విక్రమ – పరాక్రమవంతుడా ; బజరంగీ – వజ్రము వంటి దృఢమైన శరీరము కలవాడా ; కుమతినివార - దుర్బుద్ధిని తొలగించువాడా ;

సుమతికే సంగీ – మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉండువాడా ;

తాత్పర్యం

 నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు బుద్ధి  గల వారిని నివారించి మంచి బుద్ధి  కలవారికి తోడుగా  ఉండువాడవు,

కంచన వరణ   విరాజ సువేశా  |

కానన కుండల కుంచిత కేశా   || 4 ||

ప్రతిపదార్థము

కంచన వరణ  – బంగారపు రంగుతో ; విరాజ –ప్రకాశించువాడా ;

సువేశా  - మంచి వేషముతో శోభిల్లువాడా ; కాననకుండల – కర్ణభూషణములు ధరించువాడా ;

కుంచిత  కేశా  - ఉంగరాల జుట్టు కలిగినవాడా ;

తాత్పర్యం

బంగారురంగు దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి పోగులు  పెట్టుకుని, ఉంగరాల జుట్టుతో శోభిల్లువాడా .

హాథ వ జ్ర ఔ ధ్వజా విరాజై |

కాంధే మూంజ జనేవూ సాజై || 5 ||

ప్రతిపదార్థము

 హాథ  – చేతిలో ; వజ్ర - వజ్రమను ఆయుధమును ; ఔ - మరియు ;

ధ్వజ – జండాను (ధరించి);  విరాజై - ప్రకాశించువాడా  ; కాంధే  - భుజమునందు ; మూంజ – మూంజ గడ్డితో చేయబడిన ; జనేవూ   – జంధ్యం ధరించి  ; సాజై - శోభిల్లువాడా

తాత్పర్యం

ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా)

పట్టుకుని, భుజము మీదుగా  (యజ్ఞోపవీతం) ధరించినవాడా .

శంకర సువన కేసరీనందన |

తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

ప్రతిపదార్థము

 శంకర - శివుని ; సువన –

కుమారుడా ; కేసరీ నందన - కేసరి పుత్రుడా ; తేజ – తేజస్సు ;  ప్రతాప – పరాక్రమము కలవాడా ;  మహాజగ - సమస్త లోకములలో  ; వందన -పూజింపబడువాడా ;

తాత్పర్యం

శంకరుని యొక్కతేజస్సుతో ఆవిర్భవించినవాడా ! కేసరీ తనయుడా  అపార తేజోప్రతాపాలున్నవాడా!

అఖిలలోకాలచే పూజింప బడువాడా!

విద్యావాన గుణీ   అతిచాతుర |

రామ కాజ కరివేకో ఆతుర || 7 ||

ప్రతిపదార్థము

విద్యావాన -విద్యావంతుడా ; గుణీ - గుణవంతుడా ; అతి – చాలా; చాతుర - చాతుర్యము కలవాడా ; రామ –రాముని ; కాజ – కార్యము ; కరివేకో   – నెరవేర్చుటకు ; ఆతుర – ఉత్సుకత కలవాడా ;

తాత్పర్యం

విద్వాంసుడా! కళ్యాణ గుణములతో ప్రకాశించువాడా! అత్యంత చాతుర్యము

 కలవాడా! రామకార్యాన్ని నెరవేర్చుటకు ఆత్రుత పడేవాడా!

ప్రభు చరిత్ర సునివేకో రసియా |

రామ లఖన సీతా మన వసియా || 8

||

ప్రతిపదార్థము

ప్రభుచరిత్ర – శ్రీరాముని కథ ; సునివేకో   - వినుటయందు ;

రసియా  – ఆసక్తి కలవాడా ; రామ లఖన సీతా  - సీతారామలక్ష్మణుల యొక్క ; మన – హృదయమునందు ; వసియా - నివసించువాడా ;

తాత్పర్యం

శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొందువాడా !, శ్రీ సీతారామలక్ష్మణుల మనస్సులయందు నివసించువాడా

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |

వికటరూప ధరి లంక జరావా || 9 ||

ప్రతిపదార్థము

సూక్ష్మరూప – చిన్న శరీరమును ; ధరి - ధరించి ; సియహి -  సీతాదేవికి  ; దిఖావా - కనుపించితివి ;  వికటరూప - భయంకరమైన  రూపమును ; ధరి - ధరించి    ; లంకా - లంకాపురిని  ; జరావా - దహించితివి ;

తాత్పర్యం

సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించితివి .  భయంకర రూపము ధరించి లంకను కాల్చితివి .

భీమరూప ధరి అసుర సంహారే |

రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

ప్రతిపదార్థము

భీమరూప - భయంకర రూపమును ; ధారి - ధరించి ; అసుర  - రాక్షసులను ; సంహారే - సంహరించితివి ; రామచంద్రకే - రాముని యొక్క ; కాజ – కార్యము ; సంవారే -నెరవేర్చిచితివి ;

తాత్పర్యం

 సీతామాతకు సూక్ష్మరూపమున దర్శనమిచ్చి భయంకర రూపముతో లంకను ధ్వంసము చేసినవాడా! భయంకర రూపాన్ని ధరించి రాక్షసులను నాశనము చేసినవాడా!. శ్రీరామ కార్యాన్ని నెరవేర్చినవాడా .

లాయ సంజీవన లఖన జియాయె  |

శ్రీరఘువీర హరషి ఉరలాయె  || 11 ||

ప్రతిపదార్థము

లాయ - తెచ్చి   ; సజీవన - ప్రాణశక్తినిచ్చు మూలిక; లఖన - లక్ష్మణుని ;

జియాయె  - బ్రతికించితివి ; శ్రీరఘువీర – శ్రీరాముడు ;

హరషి - సంతోషించి ; ఉరలాయె  - హృదయమునకు హత్తుకొనెను ;

తాత్పర్యం

సంజీవని  పర్వతమును తెచ్చి లక్ష్మణుని  బ్రతికించినావు.. అందులకు

ఆనందమొంది శ్రీరామచంద్రుడు నిన్ను హృదయానికి హత్తుకొన్నాడు.

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |

తుమ మమ ప్రియ భరతహి  సమభాయీ || 12 ||

ప్రతిపదార్థము

రఘుపతి - రాముడు ; బరాయీకీన్హీ – పొగడెను  ; బహుత  - చాలా;  

తుమ – నీవు ; మమ - నాకు  ; ప్రియ - ప్రియమైన వాడవు

భరత - భరతునితో ; సమ - సమానమైన ; భాయీ   - సోదరా ;

తాత్పర్యం

అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు

నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.

సహస వదన తుమ్హరో యశ   గావై |

అసకహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

ప్రతిపదార్థము

సహస  వదన –వేయి నోళ్ళతో ;  తుమ్హారో - - నీ ; యశ  - కీర్తిని ;

గావై - పాడి తరించెదరు గాక ; అసకహి - అని పలికి ; శ్రీపతి - శ్రీరాముడు ; కంఠలగావై - కౌగలించుకొనెను  ;

తాత్పర్యం

భవిష్యత్తులో అందరూ  నీకీర్తిని వేనోళ్ళతో గానము చేయుదురుగాక అని శ్రీరాముడు హనుమంతుని ఆశీర్వదించి కౌగలించుకొనెను

సనకాదిక బ్రహ్మాది మునీశా   |

నారద శారద సహిత అహీశా   || 14 ||

ప్రతిపదార్థము

సనకాదిక –సనకుడు మొదలగు వారు ; బ్రహ్మాది – బ్రహ్మమొదలగువారు;

మునీశా  - ఋషులు; నారద – నారదుడు ; శారద - సరస్వతి ;

సహిత - మొదలగు ; అహీశా  – ఆదిశేషుడు ;

తాత్పర్యం

సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, సరస్వతీదేవి , ఆదిశేషుడు మొదలగువారు కూడా హనుమంతుని కీర్తిని వర్ణింప లేరు .

యమ కుబేర దిగపాల జహాఁతే |

కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 ||

ప్రతిపదార్థము

 యమ – యముడు ; కుబేరుడు – కుబేరుడు ;

దిగపాల - అష్ట  దిక్పాలకులు; తే జహా  - భూలోకవాసులయిన ; కవి  - కవులు ; కోవిద  - పండితులు; కహి సకే  - వర్ణింప గలరు? ; కహా తే - ఏ విధముగా ;

తాత్పర్యం

యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకవాసులయిన కవి పండితులకు ఏ విధముగా సాధ్యమగును?

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |

రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

ప్రతిపదార్థము

తుమ – నీవు ; ఉపకార – ఉపకారము ; సుగ్రీవహి - సుగ్రీవునికి ; కీన్హా - చేసితివి ; రామ - రామునితో  ; మిలాయ - సమావేశ పరచి   ; రాజ పద – రాజపదవిని ; దీన్హా - ఇప్పించితివి ;

తాత్పర్యం

నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము చేసితివి . రామునితో సఖ్యము కావించి  రాజపదవిని ఇప్పించావు .

తుమ్హరో మంత్ర విభీషణ   మానా |

లంకేశ్వర భయె  సబజగ జానా || 17 ||

ప్రతిపదార్థము

తుమ్హరో - నీ ; మంత్ర – సలహాను ; విభీషణ -  విభీషణుడు ;

మానా  – అంగీకరించెను ; లంకేశ్వర

- లంకకు రాజు ;

భయే -   ఆయెను ;  సబ జగ – లోకమంతటికీ ;

జానా - తెలిసినదే ;

తాత్పర్యం

నీ సలహాను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతటికి తెలిసినదే.

యుగ సహస్ర యోజన పర భానూ |

లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రతిపదార్థము

యుగ సహస్ర – రెండువేల   ;యోజన - యోజనాల ;

పర -  దూరమున ఉన్నట్టి ; భానూ  - సూర్యుని ; లీల్యో - మింగెను ; 

తాహి - దానిని ; మధుర – తీపి ; ఫల – ఫలముగా ; జానూ  -

భావించి ;

తాత్పర్యం

రెండు వేల యోజనముల  దూరములో ఉన్న సూర్యుని మధురమైన ఫలముగా భావించి మింగెను  .

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |

జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

ప్రతిపదార్థము

ప్రభు – శ్రీరాముని ; ముద్రిక – ఉంగరమును ; ముఖమాహి – నోటిలో ; మేలి - ఉంచుకొని ; జలధి - సముద్రమును ;

లాంఘి గయే - దాటెను ; ఆచరజ - ఆశ్చర్యము ; నాహీ -లేదు;

తాత్పర్యం

 శ్రీరాముడు తన ఆనవాలుగా ఉంగరమును ఇస్తే దానిని  నోట కరచుకొని

 హనుమంతుడు సాగరాన్ని దాటడములో ఆశ్చర్యం ఏముంది?

దుర్గమ కాజ జగతకే జేతే |

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

ప్రతిపదార్థము

దుర్గమ – కఠినమైన ; కాజ – కార్యములు (కలవో ) ; జగతకే  –

ప్రపంచమునందు ; జేతే - ఎన్ని ;

సుగమ – సులభము కాగలవు ; అనుగ్రహ - దయవలన  ; తుమ్హరే  - నీయొక్క ;  తేతే - అవిఅన్నియూ ;

తాత్పర్యం

విశ్వంలో కఠినమైన  కార్యాలన్నీ  నీ

అనుగ్రహము వలన  సుగమం కాగలవు.

రామ దువారే తుమ రఖవారే |

హోతన ఆజ్ఞా బిను పైసారే || 21 ||

ప్రతిపదార్థము

రామ – రాముని; దువారే - ద్వారానికి ;  తుమ – నీవు ;

రఖవారే -పాలకుడవు  ; న హోత - వీలు లేదు ; ఆజ్ఞా - అనుమతి;

బిను - లేకుండా; పైసారే  - ప్రవేశించుటకు ;

తాత్పర్యం

నీవు శ్రీరామునికి ద్వారపాలకుడవు . నీ అనుమతి లేకుండా ఎవరూ

ప్రవేశించుటకు వీలులేదు .

సబసుఖలహై తుమ్హారీ శరణా ||

తుమ రక్షక కాహూకో డరనా || 22 ||

ప్రతిపదార్థము

సబసుఖ లహై -  అన్నీ సుఖములు

లభించును ;

తుమ్హారీ - నీ ; శరణా - శరణు జొచ్చినవారికి ; తుమ – నీవు ; రక్షక - రక్షుడవుగా ఉండగా ; కాహూకో - ఎవరివలనను ; డరనా  – భయములేదు ;

తాత్పర్యం

నిన్ను శరణు జొచ్చినవారికి సమస్త సుఖములు లభించును. నీవు రక్షకుడవుగా ఉండగా వారు ఎవరికి భయపడవలసిన పని లేదు .

ఆపన తేజ సంహారో ఆపై |

తీనోఁ లోక హాంక తేఁ కాంపై || 23 ||

ప్రతిపదార్థము

ఆపన – నీ యొక్క ; తేజ -

తేజస్సును బలపరాక్రమములను ; సంహారౌ - సంబాళించుటకు  ; ఆపై - నీవే (సమర్ధుడవు);

తీనో  - మూడు; లోక – లోకాలు; తే హాంకతే  - నీ కేకతో ; కాంపై   - గడగడ వణికి పోవును ;

తాత్పర్యం

నీ తేజస్సును బలపరాక్రమములను సంబాళించుటకు నీవే సమర్ధుడవు . నీ పెద్ద కేక విని మూడు లోకములు వణికి పోవును .

భూత పిశాచ నికట నహిఁ ఆవై |

మహావీర జబ నామ సునావై || 24 ||

ప్రతిపదార్థము

భూతపిశాచ –భూతప్రేతపిశాచములు ; నికట  – సమీపంలో;

ఆవై నహి - రాజాలవు ;  మహావీర - మహావీరుడా  ;

జబ – ఎప్పుడైతే ; నామ - నామమును  ; సునావై - వినునో (అవి )

తాత్పర్యం

ఓమహావీరా ! నీ నామస్మరణచే

భూతప్రేతపిశాచములు దగ్గరకు రాజాలవు..

నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా || 25 ||

ప్రతిపదార్థము

 నాసై - నశించును ; సబరోగ – సమస్త రోగములును  ;  హరై  -నశించును ;  సబపీరా -అన్ని  పీడలు  ; జపత - జపించడమువలన ; నిరంతర – ఎల్లవేళలయందు ;

హనుమత వీరా  – వీర హనుమంతుని ;

తాత్పర్యం

నిరంతరము వీర హనుమంతుని ధ్యానించినచో సమస్త రోగములు నశించును . అన్నీ పీడలును తొలగును .

సంకటసే హనుమాన ఛుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

ప్రతిపదార్థము

సంకటసే  - కష్టముల నుండి  ;  హనుమాన - హనుమంతుని ;  ఛుడావై - విముక్తుని చేయగలడు  ; మన - మనస్సు ; క్రమ - కర్మ ; వచన -  వాక్కు  ; ధ్యానలావై – ధ్యానించునో ; జో - ఎవరు ;

తాత్పర్యం

మనస్సు వాక్కు కర్మలచే త్రికరణ శుద్ధిగా హనుమంతుని ధ్యానించువారిని స్వామి సమస్త విపత్తులనుండి కాపాడును .

సబ పర రామ తపస్వీ రాజా |

తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ప్రతిపదార్థము

 సబపర  – అందరి  కంటే గొప్పవాడు ; రామ - రాముడు ; తపస్వీ - తాపసులకు  ; రాజా - ప్రభువు  ;  తినకే  - అతని ; సకల - అన్ని ; కాజ - కార్యములను ; తుమ – నీవు ;  సాజా – సవరించుచుందువు ;

తాత్పర్యం

మునులందరికీ ప్రభువు అయిన మహానుభావుడు శ్రీరామచంద్రుని కార్యములన్నీ నీవు చక్కగా నెరవేర్చుదువు  కదా

ఔర మనోరథ జో కోయిలావై |

సోయి అమిత జీవన ఫల పావై || 28 ||

ప్రతిపదార్థము

ఔర మనోరథ – వివిధములైన

కోరికలను ;  జోకోయీ - ఎవరైతే  ; లావై - తీసుకొని ( హనుమంతుని దగ్గరకు వచ్చునో ) ; సోయి  - అతడు ; అమిత - అమితమైన ;  జీవనఫల – జీవన ఫలములను ; 

పావై  - పొందును  ;

తాత్పర్యం

 చిత్తశుద్ధితో కోరికలు

నెరవేర్చకోడానికి ఎవరైతే నీ వద్దకు వచ్చెదరో వారు  శాశ్వతానందదాయకమైన జీవనఫలాలను అమితంగా పొందెదరు .

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |

హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

ప్రతిపదార్థము

చారోయుగ  – నాలుగుయుగములలో ; పరతాప - ప్రతాపము ; తుమ్హారా - నీ ;  పరసిద్ధ  - ప్రసిద్ధము ; జగ - విశ్వమంతటా ; ఉజియారా  – ప్రకాశమానము;

తాత్పర్యం

 నీ ప్రతాపం నాలుగు యుగాలలోను  ప్రసిద్ధి చెందినది . జగమంతయు  నీ కీర్తి కాంతులతో ప్రకాశమానమై

ఉన్నది .

సాధుసంతకే తుమ రఖవారే |

అసుర నికందన రామ దులారే || 30 ||

ప్రతిపదార్థము

సాధు  - సాధువులకు ; సంతకే - చక్కగా తపస్సు చేయువారిని ; తుమ - నీవు ; రఖవారే - రక్షకుడవు ; అసుర - రాక్షసులను ;నికందన -  నాశనము చేయు వాడవు ; రామ దులారే - రామునికి ప్రియమైన వాడవు ;

తాత్పర్యం

నీవు సాధు సజ్జనులకు రక్షకుడవు . దుష్ట నాశకుడవు . శ్రీరామునికి ప్రియమైన వాడవు

అష్టసిద్ధి నౌనిధి కే దాతా |

అసవర దీన్హ జానకీ మాతా || 31 ||

ప్రతిపదార్థము

అష్టసిద్ధి - అష్టసిద్ధులకు ; నౌనిధికే  - నవనిధులకు  ;

దాతా - దాతవు ; ఆస వర –ఈ వరమును ;

దీన్హ  - ఇచ్చినది ; జానకీమాత - జానకీమాత ;

తాత్పర్యం

అష్ట సిద్ధులు నవనిధులను ప్రసాదించగలుగు వరమును జానకీమాత నీకు ఇచ్చినది .

రామ రసాయన తుమ్హరే పాసా |

సదా రహో రఘుపతి కే దాసా || 32 ||

ప్రతిపదార్థము

రామరసాయన -రామరసాయనము  ; తుమ్హరే పాసా - నీదగ్గర ;

సదా - ఎల్లప్పుడూ;  రహో – ఉండెదవు  ;

 రఘుపతి కే  – శ్రీరామచంద్రునికి ; దాసా - దాసుడవై ;

తాత్పర్యం

 నీ వద్ద రామరసామృతం ఉన్నది. నీవు  ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉందువు .

తుమ్హరే భజన రామ కోపావై |

జనమ జనమకే దుఖ బిసరావై || 33 ||

ప్రతిపదార్థము

తుమ్హరే - నీ యొక్క   ; భజన - సేవ వలన  ; రామకో పావై - శ్రీరామచంద్రుని పొందుదురు ; జనమ జనమకే – జన్మ జన్మల ; దుఃఖ - దుఃఖములు  ; బిసరవై – నశించి పోవును ;

తాత్పర్యం

నిన్ను భజించువారు రామానుగ్రహము పొంది , జన్మ  జన్మాంతర  దుఃఖముల నుండి విముక్తులగుదురు .

అంతకాల రఘువర  పుర జాయీ |

జహాఁ జన్మ హరిభక్త కహాయీ || 34 ||

ప్రతిపదార్థము

అంతకాల - జీవితాంత సమయమున ; రఘువర పుర – వైకుంఠమునకు ;  జాయీ - పోవుదురు  ; జహాజన్మ - ఎక్కడ జన్మించినను  ; హరిభక్త - హరిభక్తులని  ; కహాయీ – పిలువబడుదురు ;

తాత్పర్యం

ఆంజనేయుని భక్తితో  కొలుచువారు మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు . తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తులుగా ప్రసిద్ధి చెందుతారు .

ఔర దేవతా చిత్త న ధరయీ |

హనుమత సేయి సర్వసుఖకరయీ || 35 ||

ప్రతిపదార్థము

ఔర దేవతా – ఇతర దేవతలను  ; చిత్త – హృదయమున ;

న ధరయీ - ధరించక (ఎవడైతే ) ; హనుమత సేయి  - హనుమంతుని సేవించునో (అతనికి) ; సర్వ సుఖకరయీ  -సమస్త సుఖములు కలిగించును  ;

తాత్పర్యం

ఇతర దేవతలకు తన హృదయములో స్థానమీయక హనుమంతుని మాత్రమే ధ్యానించువానికి ఆంజనేయుడు సకలవిధ సౌఖ్యములను ప్రసాదించును .

సంకట హటై మిటై సబపీరా |

జో సుమిరై హనుమత బలవీరా || 36 ||

ప్రతిపదార్థము

సంకట - కష్టములు ; హటై - తొలగిపోవును ; మిటై - నశించును ; సబపీరా  – అన్నిపీడలు ; జో - ఎవరైతే ; సుమిరై - స్మరిస్తారో ;

హనుమత - హనుమంతుని  ; బలవీరా - మహాబలుడైన ;

తాత్పర్యం

మహాబలుడైన హనుమంతుని ఎవరు స్మరించుదురో వారి కష్టములన్నియు తొలగును. పీడలన్నియు నశించును .

జై జై జై హనుమాన గోసాయీ |

కృపా కరహు గురు దేవ కీ నాయీ || 37 ||

ప్రతిపదార్థము

జై జై జై - అనేక జేజేలు ;  హనుమాన - ఓ హనుమంతా ; గోసాయీ - జితేంద్రియుడవైన  ; కృపాకరహు  -దయచూపుము ; గురుదేవకీ  – గురుదేవుని  ; నాయీ – వలె ;

తాత్పర్యం

జితేంద్రియుడవైన ఓ ఆంజనేయ స్వామీ ! నీకు జేజేలు. గురు దేవునివలె  నాపై దయచూపుము .

జో  శతవార పాఠ కర కోయీ |

ఛూటహి బంది మహాసుఖ హోయీ || 38 ||

ప్రతిపదార్థము

జో కోయీ  - ఎవరైతే ; శత వార - వంద  సార్లు; పాఠకర  - పఠించెదరో  ;

కోయీ - ఎవరైనా; ఛూటహి బంది  -

బంధములుతొలగి ; మహాసుఖ హోయీ - మహా సుఖ ప్రాప్తి కలుగును ;

తాత్పర్యం

ఎవరైతే వందసార్లు హనుమాన్చాలీసాను పఠిస్తారో వారు బంధవిముక్తులై మహా సుఖములు

పొందెదరు .

జో యహ పఢై  హనుమాన చాలీసా |

హోయ సిద్ధి సాఖీ గౌరీసా || 39 ||

ప్రతిపదార్థము

జో - ఎవరైతే ; యహ – ఈ; హనుమాన్ చాలీసా - హనుమాన్ చాలీసాను ; పఢై -పఠించెదరో ;  హోయసిద్ధి - సిద్ధి పొందెదరు ; సాఖీ - సాక్షిగా ; గౌరీసా – పార్వతీపరమేశ్వరుల ;

తాత్పర్యం

హనుమాన్ చాలీసా అనే ఈ స్తోత్రాన్ని పఠించువారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి 

కలుగును.

తులసీదాస సదా హరి చేరా |

కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

ప్రతిపదార్థము

 

తులసీదాస – తులసీదాసు ; సదా - ఎల్లప్పుడు; హరి - నీయొక్క (హనుమంతుని యొక్క) ; చేరా - దాసుడే ; హృదయ మహ – (నా)హృదయమందు  ; డేరాకీ జై -  - నివసింపుము  ;

తాత్పర్యం

ఓ అంజనేయా! ఈ తులసీదాసు ఎల్లప్పుడు నీ సేవకుడే . కావున నా హృదయమందు నివసింపుము.

దోహా –

పవనతనయ సంకట హరణ

మంగళ మూరతి రూప ||

రామ లఖన సీతా సహిత

హృదయ బసహు సురభూప ||

ప్రతిపదార్థము

పవన తనయ – పవనపుత్ర; సంకట హరణ – దుఃఖం హరించేవాడా ;

మంగళమూరతిరూప – మంగళ స్వరూపా ; రామ లఖన సీతాసహిత - సీతారామలక్ష్మణ సహితుడవై ; హృదయబసహు – హృదయములో నివసింపుము ; సురభూప - సమస్త దేవతలకు ప్రభువైనటువంటి  ;

తాత్పర్యం

పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ  స్వరూపా (ఓ హనుమంతా).  రామలక్ష్మణ సీతా సహితుడవై  నా హృదయమందు నివసించుము.

7:45 AM

Hanuman Bahuk Telugu script

Posted by mahabhashyam

హనుమాన బాహుక  :-
Hanuman Bahuk :-


ఛప్పయ
సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల బరన తను |
భుజ బిసాల, మూరతి కరాల కాలహు కో కాల జను ||
గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ |
జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ ||
కహ తులసిదాస సేవత సులభ సేవక హిత సన్తత నికట |
గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||౧||

స్వర్న-సైల-సంకాస కోటి-రవి తరున తేజ ఘన |
ఉర విసాల భుజ దణ్డ చణ్డ నఖ-వజ్రతన ||
పింగ నయన, భృకుటీ కరాల రసనా దసనానన |
కపిస కేస కరకస లంగూర, ఖల-దల-బల-భానన ||
కహ తులసిదాస బస జాసు ఉర మారుతసుత మూరతి వికట |
సంతాప పాప తేహి పురుష పహి సపనేహుఁ నహిం ఆవత నికట ||౨||

ఝూలనా
పఞ్చముఖ-ఛఃముఖ భృగు ముఖ్య భట అసుర సుర, సర్వ సరి సమర సమరత్థ సూరో |
బాంకురో బీర బిరుదైత బిరుదావలీ, బేద బందీ బదత పైజపూరో ||
జాసు గునగాథ రఘునాథ కహ జాసుబల, బిపుల జల భరిత జగ జలధి ఝూరో |
దువన దల దమన కో కౌన తులసీస హై, పవన కో పూత రజపూత రురో ||౩||

ఘనాక్షరీ
భానుసోం పఢన హనుమాన గఏ భానుమన, అనుమాని సిసు కేలి కియో ఫేర ఫారసో |
పాఛిలే పగని గమ గగన మగన మన, క్రమ కో న భ్రమ కపి బాలక బిహార సో ||
కౌతుక బిలోకి లోకపాల హరిహర విధి, లోచనని చకాచౌంధీ చిత్తని ఖబార సో|
బల కైంధో బీర రస ధీరజ కై, సాహస కై, తులసీ సరీర ధరే సబని సార సో ||౪||

భారత మేం పారథ కే రథ కేథూ కపిరాజ, గాజ్యో సుని కురురాజ దల హల బల భో |
కహ్యో ద్రోన భీషమ సమీర సుత మహాబీర, బీర-రస-బారి-నిధి జాకో బల జల భో ||
బానర సుభాయ బాల కేలి భూమి భాను లాగి, ఫలఁగ ఫలాఁగ హూతేం ఘాటి నభ తల భో |
నాఈ-నాఈ-మాథ జోరి-జోరి హాథ జోధా జో హైం, హనుమాన దేఖే జగజీవన కో ఫల భో ||౫||

గో-పద పయోధి కరి, హోలికా జ్యోం లాఈ లంక, నిపట నిఃసంక పర పుర గల బల భో |
ద్రోన సో పహార లియో ఖ్యాల హీ ఉఖారి కర, కందుక జ్యోం కపి ఖేల బేల కైసో ఫల భో ||
సంకట సమాజ అసమంజస భో రామ రాజ, కాజ జుగ పూగని కో కరతల పల భో |
సాహసీ సమత్థ తులసీ కో నాఈ జా కీ బాఁహ, లోక పాల పాలన కో ఫిర థిర థల భో ||౬||

కమఠ కీ పీఠి జాకే గోడని కీ గాడైం మానో, నాప కే భాజన భరి జల నిధి జల భో |
జాతుధాన దావన పరావన కో దుర్గ భయో, మహా మీన బాస తిమి తోమని కో థల భో ||
కుమ్భకరన రావన పయోద నాద ఈధన కో, తులసీ ప్రతాప జాకో ప్రబల అనల భో |
భీషమ కహత మేరే అనుమాన హనుమాన, సారిఖో త్రికాల న త్రిలోక మహాబల భో ||౭||

దూత రామ రాయ కో సపూత పూత పౌనకో తూ, అంజనీ కో నన్దన ప్రతాప భూరి భాను సో |
సీయ-సోచ-సమన, దురిత దోష దమన, సరన ఆయే అవన లఖన ప్రియ ప్రాణ సో ||
దసముఖ దుసహ దరిద్ర దరిబే కో భయో, ప్రకట తిలోక ఓక తులసీ నిధాన సో |
జ్ఞాన గునవాన బలవాన సేవా సావధాన, సాహేబ సుజాన ఉర ఆను హనుమాన సో ||౮||

దవన దువన దల భువన బిదిత బల, బేద జస గావత బిబుధ బందీ ఛోర కో |
పాప తాప తిమిర తుహిన నిఘటన పటు, సేవక సరోరుహ సుఖద భాను భోర కో ||
లోక పరలోక తేం బిసోక సపనే న సోక, తులసీ కే హియే హై భరోసో ఏక ఓర కో |
రామ కో దులారో దాస బామదేవ కో నివాస| నామ కలి కామతరు కేసరీ కిసోర కో ||౯||

మహాబల సీమ మహా భీమ మహాబాన ఇత, మహాబీర బిదిత బరాయో రఘుబీర కో |
కులిస కఠోర తను జోర పరై రోర రన, కరునా కలిత మన ధారమిక ధీర కో ||
దుర్జన కో కాలసో కరాల పాల సజ్జన కో, సుమిరే హరన హార తులసీ కీ పీర కో |
సీయ-సుఖ-దాయక దులారో రఘునాయక కో, సేవక సహాయక హై సాహసీ సమీర కో ||౧౦||

రచిబే కో బిధి జైసే, పాలిబే కో హరి హర, మీచ మారిబే కో, జ్యాఈబే కో సుధాపాన భో |
ధరిబే కో ధరని, తరని తమ దలిబే కో, సోఖిబే కృసాను పోషిబే కో హిమ భాను భో ||
ఖల దుఃఖ దోషిబే కో, జన పరితోషిబే కో, మాఁగిబో మలీనతా కో మోదక దుదాన భో |
ఆరత కీ ఆరతి నివారిబే కో తిహుఁ పుర, తులసీ కో సాహేబ హఠీలో హనుమాన భో ||౧౧||

సేవక స్యోకాఈ జాని జానకీస మానై కాని, సానుకూల సూలపాని నవై నాథ నాఁక కో |
దేవీ దేవ దానవ దయావనే హ్వై జోరైం హాథ, బాపురే బరాక కహా ఔర రాజా రాఁక కో ||
జాగత సోవత బైఠే బాగత బినోద మోద, తాకే జో అనర్థ సో సమర్థ ఏక ఆఁక కో |
సబ దిన రురో పరై పూరో జహాఁ తహాఁ తాహి, జాకే హై భరోసో హియే హనుమాన హాఁక కో ||౧౨||

సానుగ సగౌరి సానుకూల సూలపాని తాహి, లోకపాల సకల లఖన రామ జానకీ |
లోక పరలోక కో బిసోక సో తిలోక తాహి, తులసీ తమాఇ కహా కాహూ బీర ఆనకీ ||
కేసరీ కిసోర బన్దీఛోర కే నేవాజే సబ, కీరతి బిమల కపి కరునానిధాన కీ |
బాలక జ్యోం పాలి హైం కృపాలు ముని సిద్ధతా కో, జాకే హియే హులసతి హాఁక హనుమాన కీ ||౧౩||

కరునానిధాన బలబుద్ధి కే నిధాన హౌ, మహిమా నిధాన గునజ్ఞాన కే నిధాన హౌ |
బామ దేవ రుప భూప రామ కే సనేహీ, నామ, లేత దేత అర్థ ధర్మ కామ నిరబాన హౌ ||
ఆపనే ప్రభావ సీతారామ కే సుభావ సీల, లోక బేద బిధి కే బిదూష హనుమాన హౌ |
మన కీ బచన కీ కరమ కీ తిహూఁ ప్రకార, తులసీ తిహారో తుమ సాహేబ సుజాన హౌ ||౧౪||

మన కో అగమ తన సుగమ కియే కపీస, కాజ మహారాజ కే సమాజ సాజ సాజే హైం |
దేవబందీ ఛోర రనరోర కేసరీ కిసోర, జుగ జుగ జగ తేరే బిరద బిరాజే హైం |
బీర బరజోర ఘటి జోర తులసీ కీ ఓర, సుని సకుచానే సాధు ఖల గన గాజే హైం |
బిగరీ సఁవార అంజనీ కుమార కీజే మోహిం, జైసే హోత ఆయే హనుమాన కే నివాజే హైం ||౧౫||

సవైయా
జాన సిరోమని హో హనుమాన సదా జన కే మన బాస తిహారో |
ఢారో బిగారో మైం కాకో కహా కేహి కారన ఖీఝత హౌం తో తిహారో ||
సాహేబ సేవక నాతే తో హాతో కియో సో తహాం తులసీ కో న చారో |
దోష సునాయే తైం ఆగేహుఁ కో హోశియార హ్వైం హోం మన తో హియ హారో ||౧౬||

తేరే థపై ఉథపై న మహేస, థపై థిర కో కపి జే ఉర ఘాలే |
తేరే నిబాజే గరీబ నిబాజ బిరాజత బైరిన కే ఉర సాలే ||
సంకట సోచ సబై తులసీ లియే నామ ఫటై మకరీ కే సే జాలే |
బూఢ భయే బలి మేరిహిం బార, కి హారి పరే బహుతై నత పాలే ||౧౭||

సింధు తరే బడే బీర దలే ఖల, జారే హైం లంక సే బంక మవాసే |
తైం రని కేహరి కేహరి కే బిదలే అరి కుంజర ఛైల ఛవాసే ||
తోసో సమత్థ సుసాహేబ సేఈ సహై తులసీ దుఖ దోష దవా సే |
బానరబాజ ! బఢే ఖల ఖేచర, లీజత క్యోం న లపేటి లవాసే ||౧౮||

అచ్ఛ విమర్దన కానన భాని దసానన ఆనన భా న నిహారో |
బారిదనాద అకంపన కుంభకరన సే కుఞ్జర కేహరి వారో ||
రామ ప్రతాప హుతాసన, కచ్ఛ, విపచ్ఛ, సమీర సమీర దులారో |
పాప తే సాప తే తాప తిహూఁ తేం సదా తులసీ కహ సో రఖవారో ||౧౯||

ఘనాక్షరీ
జానత జహాన హనుమాన కో నివాజ్యో జన, మన అనుమాని బలి బోల న బిసారియే |
సేవా జోగ తులసీ కబహుఁ కహా చూక పరీ, సాహేబ సుభావ కపి సాహిబీ సంభారియే ||
అపరాధీ జాని కీజై సాసతి సహస భాన్తి, మోదక మరై జో తాహి మాహుర న మారియే |
సాహసీ సమీర కే దులారే రఘుబీర జూ కే, బాఁహ పీర మహాబీర బేగి హీ నివారియే ||౨౦||

బాలక బిలోకి, బలి బారేం తేం ఆపనో కియో, దీనబన్ధు దయా కీన్హీం నిరుపాధి న్యారియే |
రావరో భరోసో తులసీ కే, రావరోఈ బల, ఆస రావరీయై దాస రావరో విచారియే ||
బడో బికరాల కలి కాకో న బిహాల కియో, మాథే పగు బలి కో నిహారి సో నిబారియే |
కేసరీ కిసోర రనరోర బరజోర బీర, బాఁహ పీర రాహు మాతు జ్యౌం పఛారి మారియే ||౨౧||

ఉథపే థపనథిర థపే ఉథపనహార, కేసరీ కుమార బల ఆపనో సంబారియే |
రామ కే గులామని కో కామ తరు రామదూత, మోసే దీన దూబరే కో తకియా తిహారియే ||
సాహేబ సమర్థ తో సోం తులసీ కే మాథే పర, సోఊ అపరాధ బిను బీర, బాఁధి మారియే |
పోఖరీ బిసాల బాఁహు, బలి, బారిచర పీర, మకరీ జ్యోం పకరి కే బదన బిదారియే ||౨౨||

రామ కో సనేహ, రామ సాహస లఖన సియ, రామ కీ భగతి, సోచ సంకట నివారియే |
ముద మరకట రోగ బారినిధి హేరి హారే, జీవ జామవంత కో భరోసో తేరో భారియే ||
కూదియే కృపాల తులసీ సుప్రేమ పబ్బయతేం, సుథల సుబేల భాలూ బైఠి కై విచారియే |
మహాబీర బాఁకురే బరాకీ బాఁహ పీర క్యోం న, లంకినీ జ్యోం లాత ఘాత హీ మరోరి మారియే ||౨౩||

లోక పరలోకహుఁ తిలోక న విలోకియత, తోసే సమరథ చష చారిహూఁ నిహారియే |
కర్మ, కాల, లోకపాల, అగ జగ జీవజాల, నాథ హాథ సబ నిజ మహిమా బిచారియే ||
ఖాస దాస రావరో, నివాస తేరో తాసు ఉర, తులసీ సో, దేవ దుఖీ దేఖిఅత భారియే |
బాత తరుమూల బాఁహూసూల కపికచ్ఛు బేలి, ఉపజీ సకేలి కపి కేలి హీ ఉఖారియే ||౨౪||

కరమ కరాల కంస భూమిపాల కే భరోసే, బకీ బక భగినీ కాహూ తేం కహా డరైగీ |
బడీ బికరాల బాల ఘాతినీ న జాత కహి, బాఁహూ బల బాలక ఛబీలే ఛోటే ఛరైగీ ||
ఆఈ హై బనాఈ బేష ఆప హీ బిచారి దేఖ, పాప జాయ సబ కో గునీ కే పాలే పరైగీ |
పూతనా పిసాచినీ జ్యౌం కపి కాన్హ తులసీ కీ, బాఁహ పీర మహాబీర తేరే మారే మరైగీ ||౨౫||

భాల కీ కి కాల కీ కి రోష కీ త్రిదోష కీ హై, బేదన బిషమ పాప తాప ఛల ఛాఁహ కీ |
కరమన కూట కీ కి జన్త్ర మన్త్ర బూట కీ, పరాహి జాహి పాపినీ మలీన మన మాఁహ కీ ||
పైహహి సజాయ, నత కహత బజాయ తోహి, బాబరీ న హోహి బాని జాని కపి నాఁహ కీ |
ఆన హనుమాన కీ దుహాఈ బలవాన కీ, సపథ మహాబీర కీ జో రహై పీర బాఁహ కీ ||౨౬||

సింహికా సఁహారి బల సురసా సుధారి ఛల, లంకినీ పఛారి మారి బాటికా ఉజారీ హై |
లంక పరజారి మకరీ బిదారి బార బార, జాతుధాన ధారి ధూరి ధానీ కరి డారీ హై ||
తోరి జమకాతరి మందోదరీ కఠోరి ఆనీ, రావన కీ రానీ మేఘనాద మహతారీ హై |
భీర బాఁహ పీర కీ నిపట రాఖీ మహాబీర, కౌన కే సకోచ తులసీ కే సోచ భారీ హై ||౨౭||

తేరో బాలి కేలి బీర సుని సహమత ధీర, భూలత సరీర సుధి సక్ర రవి రాహు కీ |
తేరీ బాఁహ బసత బిసోక లోక పాల సబ, తేరో నామ లేత రహైం ఆరతి న కాహు కీ ||
సామ దామ భేద విధి బేదహూ లబేద సిధి, హాథ కపినాథ హీ కే చోటీ చోర సాహు కీ |
ఆలస అనఖ పరిహాస కై సిఖావన హై, ఏతే దిన రహీ పీర తులసీ కే బాహు కీ ||౨౮||

టూకని కో ఘర ఘర డోలత కఁగాల బోలి, బాల జ్యోం కృపాల నత పాల పాలి పోసో హై |
కీన్హీ హై సఁభార సార అఁజనీ కుమార బీర, ఆపనో బిసారి హైం న మేరేహూ భరోసో హై ||
ఇతనో పరేఖో సబ భాన్తి సమరథ ఆజు, కపిరాజ సాంచీ కహౌం కో తిలోక తోసో హై |
సాసతి సహత దాస కీజే పేఖి పరిహాస, చీరీ కో మరన ఖేల బాలకని కోసో హై ||౨౯||

ఆపనే హీ పాప తేం త్రిపాత తేం కి సాప తేం, బఢీ హై బాఁహ బేదన కహీ న సహి జాతి హై |
ఔషధ అనేక జన్త్ర మన్త్ర టోటకాది కియే, బాది భయే దేవతా మనాయే అధీకాతి హై ||
కరతార, భరతార, హరతార, కర్మ కాల, కో హై జగజాల జో న మానత ఇతాతి హై |
చేరో తేరో తులసీ తూ మేరో కహ్యో రామ దూత, ఢీల తేరీ బీర మోహి పీర తేం పిరాతి హై ||౩౦||

దూత రామ రాయ కో, సపూత పూత వాయ కో, సమత్వ హాథ పాయ కో సహాయ అసహాయ కో |
బాఁకీ బిరదావలీ బిదిత బేద గాఇయత, రావన సో భట భయో ముఠికా కే ధాయ కో ||
ఏతే బడే సాహేబ సమర్థ కో నివాజో ఆజ, సీదత సుసేవక బచన మన కాయ కో |
థోరీ బాఁహ పీర కీ బడీ గలాని తులసీ కో, కౌన పాప కోప, లోప ప్రకట ప్రభాయ కో ||౩౧||

దేవీ దేవ దనుజ మనుజ ముని సిద్ధ నాగ, ఛోటే బడే జీవ జేతే చేతన అచేత హైం |
పూతనా పిసాచీ జాతుధానీ జాతుధాన బాగ, రామ దూత కీ రజాఈ మాథే మాని లేత హైం ||
ఘోర జన్త్ర మన్త్ర కూట కపట కురోగ జోగ, హనుమాన ఆన సుని ఛాడత నికేత హైం |
క్రోధ కీజే కర్మ కో ప్రబోధ కీజే తులసీ కో, సోధ కీజే తినకో జో దోష దుఖ దేత హైం ||౩౨||

తేరే బల బానర జితాయే రన రావన సోం, తేరే ఘాలే జాతుధాన భయే ఘర ఘర కే |
తేరే బల రామ రాజ కియే సబ సుర కాజ, సకల సమాజ సాజ సాజే రఘుబర కే ||
తేరో గునగాన సుని గీరబాన పులకత, సజల బిలోచన బిరంచి హరిహర కే |
తులసీ కే మాథే పర హాథ ఫేరో కీస నాథ, దేఖియే న దాస దుఖీ తోసో కనిగర కే ||౩౩||

పాలో తేరే టూక కో పరేహూ చూక మూకియే న, కూర కౌడీ దూకో హౌం ఆపనీ ఓర హేరియే |
భోరానాథ భోరే హీ సరోష హోత థోరే దోష, పోషి తోషి థాపి ఆపనో న అవ డేరియే ||
అఁబు తూ హౌం అఁబు చూర, అఁబు తూ హౌం డింభ సో న, బూఝియే బిలంబ అవలంబ మేరే తేరియే |
బాలక బికల జాని పాహి ప్రేమ పహిచాని, తులసీ కీ బాఁహ పర లామీ లూమ ఫేరియే ||౩౪||

ఘేరి లియో రోగని, కుజోగని, కులోగని జ్యౌం, బాసర జలద ఘన ఘటా ధుకి ధాఈ హై |
బరసత బారి పీర జారియే జవాసే జస, రోష బిను దోష ధూమ మూల మలినాఈ హై ||
కరునానిధాన హనుమాన మహా బలవాన, హేరి హఁసి హాఁకి ఫూంకి ఫౌంజై తే ఉడాఈ హై |
ఖాయే హుతో తులసీ కురోగ రాఢ రాకసని, కేసరీ కిసోర రాఖే బీర బరిఆఈ హై ||౩౫||

సవైయా
రామ గులామ తు హీ హనుమాన గోసాఁఈ సుసాఁఈ సదా అనుకూలో |
పాల్యో హౌం బాల జ్యోం ఆఖర దూ పితు మాతు సోం మంగల మోద సమూలో ||
బాఁహ కీ బేదన బాఁహ పగార పుకారత ఆరత ఆనఁద భూలో |
శ్రీ రఘుబీర నివారియే పీర రహౌం దరబార పరో లటి లూలో ||౩౬||

ఘనాక్షరీ
కాల కీ కరాలతా కరమ కఠినాఈ కీధౌ, పాప కే ప్రభావ కీ సుభాయ బాయ బావరే |
బేదన కుభాఁతి సో సహీ న జాతి రాతి దిన, సోఈ బాఁహ గహీ జో గహీ సమీర డాబరే ||
లాయో తరు తులసీ తిహారో సో నిహారి బారి, సీంచియే మలీన భో తయో హై తిహుఁ తావరే |
భూతని కీ ఆపనీ పరాయే కీ కృపా నిధాన, జానియత సబహీ కీ రీతి రామ రావరే ||౩౭||

పాఁయ పీర పేట పీర బాఁహ పీర ముంహ పీర, జర జర సకల పీర మఈ హై |
దేవ భూత పితర కరమ ఖల కాల గ్రహ, మోహి పర దవరి దమానక సీ దఈ హై ||
హౌం తో బిను మోల కే బికానో బలి బారే హీతేం, ఓట రామ నామ కీ లలాట లిఖి లఈ హై |
కుఁభజ కే కింకర బికల బూఢే గోఖురని, హాయ రామ రాయ ఐసీ హాల కహూఁ భఈ హై ||౩౮||

బాహుక సుబాహు నీచ లీచర మరీచ మిలి, ముఁహ పీర కేతుజా కురోగ జాతుధాన హై |
రామ నామ జప జాగ కియో చహోం సానురాగ, కాల కైసే దూత భూత కహా మేరే మాన హై ||
సుమిరే సహాయ రామ లఖన ఆఖర దౌఊ, జినకే సమూహ సాకే జాగత జహాన హై |
తులసీ సఁభారి తాడకా సఁహారి భారి భట, బేధే బరగద సే బనాఈ బానవాన హై ||౩౯||

బాలపనే సూధే మన రామ సనముఖ భయో, రామ నామ లేత మాఁగి ఖాత టూక టాక హౌం |
పరయో లోక రీతి మేం పునీత ప్రీతి రామ రాయ, మోహ బస బైఠో తోరి తరకి తరాక హౌం ||
ఖోటే ఖోటే ఆచరన ఆచరత అపనాయో, అంజనీ కుమార సోధ్యో రామపాని పాక హౌం |
తులసీ గుసాఁఈ భయో భోండే దిన భూల గయో, తాకో ఫల పావత నిదాన పరిపాక హౌం ||౪౦||

అసన బసన హీన బిషమ బిషాద లీన, దేఖి దీన దూబరో కరై న హాయ హాయ కో |
తులసీ అనాథ సో సనాథ రఘునాథ కియో, దియో ఫల సీల సింధు ఆపనే సుభాయ కో ||
నీచ యహి బీచ పతి పాఇ భరు హాఈగో, బిహాఇ ప్రభు భజన బచన మన కాయ కో |
తా తేం తను పేషియత ఘోర బరతోర మిస, ఫూటి ఫూటి నికసత లోన రామ రాయ కో ||౪౧||

జీఓ జగ జానకీ జీవన కో కహాఇ జన, మరిబే కో బారానసీ బారి సుర సరి కో |
తులసీ కే దోహూఁ హాథ మోదక హైం ఐసే ఠాఁఊ, జాకే జియే ముయే సోచ కరిహైం న లరి కో ||
మో కో ఝూఁటో సాఁచో లోగ రామ కౌ కహత సబ, మేరే మన మాన హై న హర కో న హరి కో |
భారీ పీర దుసహ సరీర తేం బిహాల హోత, సోఊ రఘుబీర బిను సకై దూర కరి కో ||౪౨||

సీతాపతి సాహేబ సహాయ హనుమాన నిత, హిత ఉపదేశ కో మహేస మానో గురు కై |
మానస బచన కాయ సరన తిహారే పాఁయ, తుమ్హరే భరోసే సుర మైం న జానే సుర కై ||
బ్యాధి భూత జనిత ఉపాధి కాహు ఖల కీ, సమాధి కీ జై తులసీ కో జాని జన ఫుర కై |
కపినాథ రఘునాథ భోలానాథ భూతనాథ, రోగ సింధు క్యోం న డారియత గాయ ఖుర కై ||౪౩||

కహోం హనుమాన సోం సుజాన రామ రాయ సోం, కృపానిధాన సంకర సోం సావధాన సునియే |
హరష విషాద రాగ రోష గున దోష మఈ, బిరచీ బిరఞ్చీ సబ దేఖియత దునియే ||
మాయా జీవ కాల కే కరమ కే సుభాయ కే, కరైయా రామ బేద కహేం సాఁచీ మన గునియే |
తుమ్హ తేం కహా న హోయ హా హా సో బుఝైయే మోహిం, హౌం హూఁ రహోం మౌనహీ వయో సో జాని లునియే ||౪౪||



శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
   SuklAMbaradharaM viShNuM SaSivarNaM caturBujaM
   prasannavadanaM dhyAyEt sarvaviGnOpaSAMtayE


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః
   gururbrahmA gururviShNurgururdEvO mahESvaraH
   guruH sAkShAt paraM brahma tasmai SrIguravE namaH

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
   vyAsAya viShNu rUpAya vyAsarUpAya viShNavE
   namO vai brahmanidhayE vAsiShThAya namO namaH

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
   kUjaMtaM rAmarAmEti madhuraM madhurAkSharaM
   AruhyakavitA SAKAM vaMdE vAlmIki kOkilam

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవద్పాదం శంకరం లోకశంకరం
   Sruti smRuti purANAnAM AlayaM karuNAlayaM
   namAmi BagavadpAdaM SaMkaraM lOkaSaMkaraM


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
   vAgarthAviva saMpRuktau vAgarthapratipattayE
   jagataH pitarau vaMdE pArvatIparamESvarau

సూక్తిం  సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీః
శ్రీరంగరాజ మహిషీ మధురైః కటాక్షైః
 వైధగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం
కండూలకర్ణకుహరాః కవయోధయంతి
   sUktiM  samagrayatu naH svayamEva lakShmIH
   SrIraMgarAja mahiShI madhuraiH kaTAkShaiH
     vaidhagdhyavarNaguNaguMBanagauravairyAM
   kaMDUlakarNakuharAH kavayOdhayaMti

హైమోత్ర పుండ్ర మజహంమకుటంసునాసం మందస్మితం మకరకుండల చారుగండం
 బింబాధరం బహుళ దీర్ఘ కృపా కటాక్షం శ్రి వేంకటేశ ముఖమాత్మనిసన్నిదత్తాం
   haimOtra puMDra majahaMmakuTaMsunAsaM maMdasmitaM makarakuMDala cArugaMDaM
    biMbAdharaM bahuLa dIrGa kRupA kaTAkShaM Sri vEMkaTESa muKamAtmanisannidattAM

విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ
కామాక్షి పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ
   vimalapaTI kamalakuTI pustakarudrAkShaSastahastapuTI
   kAmAkShi pakShmalAkShI kalitavipaMcI viBAsi vairiMcI

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
   manOjavaM mAruta tulyavEgaM jitEMdriyaM buddhimatAM variShTam
   vAtAtmajaM vAnarayUdha muKyaM SrIrAmadUtaM SirasA namAmi

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
   ApadAmapahartAraM dAtAraM sarvasaMpadAM
   lOkABirAmaM SrIrAmaM BUyOBUyO namAmyahaM

హరిః ఓం
hariH OM




























 మా కైలాస్ మానస సరోవర ,నేపాల్ ముక్తినాథ్ యాత్ర 

               ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం ఎవరో మానస సరోవర యాత్ర కి పోయి వచ్చి ఆ జలాన్ని మాకు కొంచెం ఇచ్చారు. ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నారో మానస సరోవరం వెళ్ళి వచ్చారను కొన్నాను.
              2008 లో “చార్ ధాం” యాత్ర చేసి వచ్చిన తరువాత  “కైలాస్ మానస సరోవర యాత్ర” చేయాలనే కోరిక బలపడింది. అప్పటి నుండి ఈ యాత్ర ఎలా చెయ్యాలి? ఎవరు తీసుకు వెళ్తారు? అని అందరినీ అడిగే వాడిని. ఉద్యోగం లో వుండ గానే వెళ్తే బాగుండు నని అనుకున్నాను. కానీ భగవదనుగ్రహం కలుగలేదు. 2011 లో ఉద్యోగం నుండి విశ్రమించేను. అయినా రోజు రోజుకి మానస సరోవర్ వెళ్లాలనే సంకల్పం బలపడ సాగింది. ఎవరి ద్వారా వెళితే యాత్ర బాగా ఆధ్యాత్మికంగా జరుగు తుందో తెలుసు కుంటూ ఉండగా మా సింగరేణి కంపనీ లో పని చేసిన ఇంజినీరు శాస్త్రి గారు 2013 లో యెమ్. యెస్. రామారావు ట్రస్ట్   ద్వారా శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గురూజీ ఆధ్వర్యంలో కైలాస్ మానస సరోవర్,నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేశారని తెలిసి వారిని కలిసి వివరాలు అడిగేను. శ్రీ శ్రీనివాస్ గురూజీ వారి కూడావుండి వారిచే హోమాలు, పూజలు చేయిస్తూ మానస సరోవర యాత్ర ఎంతో ఆధ్యాత్మికంగా, ముక్తి దాయకంగా చేయించారని తెలుసుకొని ఆనందించాను. వారి యాత్ర “వీడియో” కూడా చూపించేరు. చాలా త్రిల్లింగ్ గా అనిపించింది. వెంటనే శ్రీ శ్రీనివాస్ గురూజీకి ఆయనచేతనే ఫోను చేయించేను. అది డిసెంబర్ 2014 లో.
              శ్రీనివాస్ గురూజి ఎంతో చక్కగా ఉత్సాహ పరుస్తూ మాట్లాడి యాత్ర తేదీలు ఫిబ్రవరి, మార్చ్ నెలలలో ఖరారు అవుతాయని, అప్పటినుండి రిజిస్ట్రేషన్ మొదలవు తుందని , తేదీలు ఖరారవగానే తెలియచేస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే ఫిబ్రవరి 2015 లో శ్రీనివాస్ గారు మాకు ఫోను చేసి 2015 లో రెండు సార్లు కైలాస్ మానస సరోవర్, నేపాల్ ముక్తినాథ్ యాత్ర నిర్వహిస్తా మని,మొదటి యాత్ర   21 జూన్ 2015 నుండి 18 రోజులు ఉంటుందని, రెండవ యాత్ర 18 ఆగస్ట్ 2015 నుండి 18 రోజులు ఉంటుందని తెలియ జేసారు.
            చిరకాల వాంఛ తీరుతోందని తొందరగా వెళ్లాలనే తపనతో జూన్ 2015 యాత్రకు సిద్ధమని తెలియ జేసి మా భార్యాభర్తల పేర్లను నమోదు చేయమని కోరుతూ వారి ఇంటికి వెళ్ళి “పాస్ పోర్ట్” జిరాక్స్ కాగితాలను శ్రీనివాస్ గారికి అందజేసి యాత్ర వివరాలను అడిగేము.
             శ్రీ శ్రీనివాస్ గారు, అప్పటికే 9 సార్లు మానస సరోవర యాత్ర నిర్వ్హించానని, ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరుగ లేదని, వారి యాత్రానుభవాలు చెపుతూ వుంటే మేము ఏదో లోకంలోకి వెళ్లిపోయాము.
            అంతలోనే మా అదృష్టమో, దురదృస్టమో నేపాలంతా పలుమార్లు భూకంపంతో అతలా కుతలం అయి పోయింది. (మార్చ్, ఏప్రిల్, మే 2015 మాసాలలో ). మా యాత్ర నేపాల్ మీదుగా జరుగు తుంది. ఒక్క సారి మా మానస సరోవర యాత్ర అనే కల చెదరి పోయినట్లయింది. ఆ మహా శివునికే మొరపెట్టుకున్నాను.
           కం”        పరిశోధన చేయకయా!
                        పరమేశా పాహి! పాహి! పశుపతి నాధా !
                        మరినీ కైలాసగిరికి
                        పరిక్రమను చేయ నిచ్చు బాధ్యత నీదే!                                (7 -5 – 2015)
             అని.  ఖాట్మండు నుండి మానస సరోవర్ కు పోయే దారిలో అక్కడక్కడా భూకంపం వలన రహదారి పాడయిందని ఆ దారిలో ఈ సంవత్సరం యాత్ర జరిగే టట్లు లేదని సమాచారం తెలిసింది. అయినా భగవంతునిపై మా నమ్మకం చెదరలేదు.  మా గురూజీ శ్రీనివాస్ గారు అధైర్య పడవద్దని ఆ భగవంతుడే చూసుకొంటాడని ధైర్యం చెప్పారు. అప్పటికే మా జూన్ యాత్రకి విమానం టిక్కట్లు కొనడం జరిగింది. కానీ శివాజ్ఞ వేరే రకం గా వుంది. జూన్ లో వుండవలసిన మా యాత్రకి చైనా ప్రభుత్వం వీసాలు జారీ చేయలేదు. మా గురూజీ మాత్రం మాకు ధైర్యం చెపుతూ ఆగస్ట్ కి అన్నీ సర్దుకుంటాయని మనం తప్పక యాత్ర చేస్తామని చెప్పి మా విమానం తిక్కట్లు ఆగస్ట్ కి మార్చారు. పరమ శివునిపై నమ్మకం తో అందరం ఆగస్ట్ యాత్రకి సిద్ధం ఆయాము. నేపాల్ భూకంపం భయం తో మాలో కొందరు భయపడి విరమించు కున్నారు. మేము మాత్రం గురూజీ మీద నమ్మకంతో యాత్రకి సిద్ధం ఆయ్యాము.  ఈలోగా మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఈయేడాది మానస సరోవర్ కి ఖాట్మండు నుండి రోడ్డు ద్వారా యాత్రకి చైనా వీసా జారీచేయడంలేదని,  కొద్ది మందికి  విమానం, హెలికోప్టర్  రూటులో వీసా ఇవ్వవచ్చని  అది కూడా గ్యారంటీ లేదని  తెలిసింది. గురూజీ అందరికీ ఈ విషయం తెలియజేసి ఆ రూటు లో ఖర్చు ఎక్కువ అవుతుందని ఇస్ట మయిన వారికి వీసా ప్రయత్నం చేస్తానని చెప్పారు. మొత్తం 32 మంది సిద్ధం అయ్యాము. గురూజీ భగవంతునిమీద భారం వేసి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆగస్ట్ 18 న మా ప్రయాణం మొదలవాలి. ఆగస్ట్ 15 వరకు వీసా సమాచారం తెలియలేదు. ఆరోజు గురూజీ ఇంట్లో అందరినీ సమావేశ పరచారు. వీసా వచ్చే అవకాశం ఉందని తెలిసిందని, మెసేజ్ వచ్చేవరకు నమ్మలేమని, భగవంతుడే చూసుకుంటాడని , ఆగస్ట్ 16 లోగా వీసా మెసేజ్ రాకపోతే ఈ సంవత్సరం ఇక యాత్ర లేనట్టేనని చెపితే బాధ అనిపించింది. 16న మెసేజ్ రాక పోతే 17 న టికెట్ కాన్సెల్ చేసుకోమని చెప్పారు. భగవంతునిపై భారం వేసి  అందరం భారంగా ఇంటికి చేరు కొన్నాము. ఇంటికి చేరిన గంటలో గురూజీ వీసా వచ్చినట్టు మెసేజ్ వచ్చిందని ఫోన్  లో చెప్పి, అందరినీ యాత్రకి కావలిసినవి సర్దుకోమని (లిస్ట్ ముందే ఇచ్చారు)చెప్పారు.
             మా ఆనందానికి అవధులు లేవు. పరమేశ్వరునిపై మా నమ్మకం వమ్ము  కాలేదు. ఈ ఏడాది విమానాలు, హెలికోప్టర్ రూటులో కొద్ది మందికి మాత్రమే వీసా ఇచ్చారని  ( 4 –5 వందల మందికి మాత్రమే) తెలిసింది. అందులో మేముండడం మా అదృష్టం, పరమేశ్వరుని అనుగ్రహం.
             వెంటనే చలికి యాత్రలో తట్టుకునే లోపలి ఉన్ని దుస్తులు వగైరా కొనుక్కొని, గురూజీ ట్రస్ట్ తరఫున ఇచ్చిన బ్యాగులలోఅన్నీ సర్దుకుని యాత్రకి సిద్ధం అయ్యాము. గురూజీ అందర్నీ 18 ఉదయం 4 గం. లకు హైదారాబాద్ విమానాశ్రయం లో వుండాలని చెప్పారు.
యాత్ర మొదటి రోజు: 18 – 08 - 2015.
             గురూజీ చెప్పినట్లుగానే అందరం 18 ఉదయం 4 గం. లకు విమానాశ్రయం చేరుకుని లగేజ్ ఇచ్చి బోర్డింగ్ పాస్ తీసుకుని ఎయిర్ఇండియా విమానం ఎక్కాము. సరిగ్గా 6.50 ని.లకు మా విమానం బయలుదేరింది.అందరమూ భగవంతుడిని తలుచుకొని బయలు దేరాము. 8.50 ని.లకు. ఢిల్లీ విమానాశ్రయం చేరాము. గురూజీ ఆ విమానాశ్రయంలోనే ఒక హోటల్ లో అందరికీ ఫలహారాలు పెట్టించి మా గ్రూపులో అందరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేశారు.
             ఢిల్లీ నుండి మా ఖాట్మండు విమానం 2 గం. లకు బయలుదేరి 3.15 కి చేరింది. మా దురదృస్టమో ఏమో కొందరి లగేజ్ ప్రతికూల వాతావరణం దృస్ట్యా డిల్లీ విమానాశ్రయం లో నిలిపివేశారని తెలిసింది. అందులో మా లగేజ్ కూడా రాలేదు. కట్టు బట్టలతో ఉన్నాము. మాతో వచ్చిన ఇంకొక సింగరేణి ఇంజనీరు కృష్ణ మూర్తి గారి లగేజ్ వచ్చింది. అక్కడే ఖాట్మండు విమానాశ్రయం లో లగేజ్ రాలేదని ఫిర్యాదు చేసి మా హోటల్ కి చేరుకున్నాము. మరునాడు ఉదయం విమానం లో మా లగేజ్ వస్తుందని చెప్పారు.వచ్చేవరకు నమ్మకం లేదని కొందరు అన్నారు.  ఆడుగ డుగునా భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు. ఆ రాత్రికి కట్టుబట్టలతో అలాగే హోటల్ లో పడుకున్నాము.
యాత్ర 2వ రోజు: 19 – 08 – 2015.
              ఉదయమే లేచి, కాఫీ త్రాగి మా స్నేహితుడు కృష్ణ మూర్తి గారు ఇచ్చిన పట్టు బట్టలు కట్టుకొని సిద్ధం అవగానే  గురూజీ అందర్నీ పశుపతినాథ్ ఆలయానికి తీసుకెళ్లి స్వామి దర్శనం అనంతరం మాచే రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం చేయించి మానస సరోవర్ యాత్ర జయప్రదంగా జరగాలని రక్షకట్టించి సిద్ధం చేశారు. గుడినుండి హోటల్ కి వచ్చి అల్పాహారం తీసుకొని “బుడే నీలకంఠ్” (పవళించి యున్న శ్రీమన్నారాయణుడు)   గుడికి తీసుకెళ్లారు ఖాట్మండులో. స్వామి దర్శనం చేసుకోగానే స్వామికి మాపై అపారమైన కృప కలిగింది. మా మిస్ అయిన లగేజ్ వచ్చిందని , వెంటనే హోటల్ కి  వచ్చి లగేజ్  సరి చూసుకోమని గురూజీ నుండి ఫోన్ వచ్చింది. ఇదే భగవంతునిపై మనకున్న నమ్మకానికి నిదర్శనం.
            వెంటనే హోటల్ కి వెళ్ళి మా లగేజ్ సరి చూసుకొని మా మానస సరోవర యాత్ర కి కావలసిన సామగ్రిని ఒక బ్యాగ్ లో సర్దుకొని మిగతా లగేజ్ ని మా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి ఆ హోటల్ లోనే విడిచిపెట్టి లంచ్ తీసుకొని మా యాత్ర కొనసాగించడానికి ఖాట్మండు విమానాశ్రయానికి తరలి వెళ్లాము. అక్కడనుండి “యెతీ ఎయిర్ వేస్” వారి చిన్న (26 సీట్ల) విమానం లో 3 గం.లకు బయలు దేరి 4గం. లకు నేపాల్ గంజ్ చేరుకున్నాము. ఈ నగరం ఉత్తర్ ప్రదేశ్ బోర్డర్ లో   వుంటుంది. నేపాల్ గంజ్ లో ఆరాత్రి “సిద్ధార్థ”అనే హోటల్ లో బస చేశాము. హోటల్ చాలా బాగుంది. స్నానాలు చేసి ఆ వూరిలో వున్న “భాగేశ్వరిమాత” గుడికి వెళ్లాము. అమ్మ వారి 51 శక్తి పీఠాలలో అది ఒకటని, అక్కడ అమ్మ వారి తెగిన నాలిక పడిందని చెప్పారు. ఆ గుడిలో భజన చాలాబాగా చేశారు. దర్శనం బాగా జరిగింది. ఆ రాత్రి భోజనం అవగానే గురూజీ అందరినీ సమావేశ పరచి యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి , యాత్రలో చలికి తట్టుకోడానికి దళసరి “డౌన్ జాకెట్” లు , అల్ల్యుమినియమ్ నీళ్ళ సీసాలు (వేడి నీలు పెట్టుకోడానికి )ఇచ్చారు. మరునాడు వెళ్లబోయే స్థలం గురించి తెలియ జేసారు.


యాత్ర 3వ రోజు: 20 – 08 – 2015.
            ఉదయం 4.30 ని. లకు అందరం లేచి స్నానాలు చేసి గురూజీ చేయించే రుద్రాభిషేకం లో పాల్గొన్నాము. చాలాఆ నందంగా అనిపించింది. 5గం. లకు అల్పాహారం ముగించి, నేపాల్ గంజ్  విమానాశ్రయానికి బయలు దేరాము. లగేజ్ చెకింగ్ అవగానే 14 సీట్ల
చిన్న “తారా  ఎయిర్ వేస్ “ విమానం లో 9.25ని.లకు బయలుదేరి 10.15 ని.లకు “సిమికోట్” అనే హిమాలయ పర్వత ప్రాంతం లో దిగేము. అది సముద్ర మట్టానికి 3,100 మీ. ఎత్తులో ఉంది. చుట్టూ ఐస్ పర్వతాలతో వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంది .ఆ రాత్రికి అక్కడే ఒక హోటల్ లో బస చేశాము.
           కైలాస్, మానస సరోవర్ యాత్ర చెయ్యాలంటే హిమాలయాల్లో 22,000 అడుగుల పైకి ఎక్కాలి. అక్కడ ప్రాణవాయువు చాలా తక్కువుగా వుంటుంది. అక్కడి వాతావరణానికి మన శరీరం అలవాటు పడాలంటే, మధ్యలో ఆగుతూ వెళ్ళాలి. లేకపోతే, ప్రాణాపాయం జరిగే అవకాశం వుంటుంది. ఆ వాతావరణానికి (హై altitude) అలవాటు పడడానికి dimox అనే మాత్రలు కూడా అక్కడ వున్నన్ని  రోజులు వేసుకోవాలి.
           గురూజీ ఆ సాయంత్రం అందరితో సమావేశం ఏర్పాటు చేసి “రుద్రం” చదివి అర్ధం వివరించారు. భోజనాలు అయ్యాక అందరికీ dimox మాత్రలు ఇచ్చి యాత్ర పూర్తయి నేపాల్ వెళ్ళేవరకు రోజు వేసుకోవాలని చెప్పారు. ఆ హిమాలయాల మధ్యన అందమయిన ప్రకృతి ఒడిలో అతి చల్లని వాతావరణంలో ఏదో తెలియని ఆతృత తో ఆరోజు అక్కడ పడుకున్నాము.
యాత్ర 4వ రోజు: 21 – 08 – 2015.
           ఆరోజు “శ్రావణ శుక్రవారం”. మా గ్రూపు 32 మందిలో 21 మంది స్త్రీలే.  ఉదయం 5 గం. లకు లేపి స్త్రీ లందరితో “వరలక్ష్మి” వ్రతం చేయించారు. తరువాత అందరం అల్పాహారం తీసుకొని 7 గం. ల నుండి 6 ట్రిప్పులలో హెలికోప్టర్ లో “హిల్సా” అనే ప్రాంతానికి వెళ్లాము. హిల్సా చైనా బోర్డర్ లో ఉన్ననేపాల్ గ్రామం.  హెలికోప్టర్ లో ఒకసారి 5 గురు వారి లగేజ్ వెళ్లవచ్చు. అందరం హిల్సా చేరే సరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. అక్కడ అందరం భోజనం చేసి మధ్యాహ్నం 3 గం. లకు చైనా లో ప్రవేశించాము. అక్కడ నుండి మా బస్ ప్రయాణం మొదలయింది. 1  కి.మీ. వెళ్ళగానే చైనా చెక్ పోస్ట్ వచ్చింది. అక్కడ మా వీసా, పాస్ పోర్ట్ లగేజ్ చెక్ చేసి, చైనా ఆక్రమించిన టిబెట్ (మానస సరోవర్, కైలాస్ పర్వతాలు ఇక్కడే వున్నాయి.) లోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.  అక్కడ నుండి ఒక గంటలో “పురాంగ్”, అనే పట్టణం చేరుకున్నాము. అక్కడ కస్టమ్స్ వారు మళ్ళీ మా లగేజ్, వీసాలు చెక్ చేసారు. పురాంగ్ సముద్ర మట్టానికి 3,500 మీ. ఎత్తులో  హిమాలయాల మధ్య వుంటుంది. ఆరాత్రికి మా బస హోటల్లో అక్కడే. అక్కడ నుండి గురూజీ తీసుకు వచ్చిన నేపాలు  వంట  వారి భోజనం. భోజనాలు చేసి రాత్రి అతి చల్లని వాతావరణం లో అక్కడ హోటల్ లో పడుకున్నాము.
యాత్ర 5 వ రోజు: 22 – 08 – 2015.
             ఉదయం 6 గం. లకు అందరం సమావేశ మయి గురుజీ చేసే రుద్రాభిషేకం లో పాల్గొన్నాము. తరువాత ఫలహారాలు చేసి పురాంగ్ లో కాసేపు తిరిగేము. అక్కడే గురూజీ మానస సరోవర్ ఒడ్డున చేయబోయే “హోమాల”కి కావలసిన నెయ్యి వగయిరా సామగ్రి అంతా తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గం. లకు భోజనం చేసి “మానస సరోవరం” దగ్గరికి బయలు దేరాము. దారిలో రావణాసురుడు తపస్సు చేసిన “రాక్షస తాల్” అనే పెద్ద సరస్సుని చూసుకుంటూ సాయంత్రం 4 గం. లకు మానస సరోవర్ ఒడ్డుకు చేరుకున్నాము. మానస సరోవర్ చూడగానే ఒళ్ళు జలదరించింది. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం కదా అనిపించింది. మానస సరోవర్ ఒడ్డునే మా బస. చాలా పెద్ద ఆవరణలో వరుసగా గదులున్నాయి.  చలికి తట్టుకొనే పరుపులతో. మానస సరోవరం సముద్ర మట్టానికి 4,200 మీ. ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న సరోవరం ప్రపంచం లో అదే. విభీషణుని భార్య “సురమ” ఈ సరస్సు ఒడ్డునే జన్మించినట్లు వాల్మీకి రామాయణం లో ఉంది.  ఆ సరోవరానికి దగ్గరలోనే మహా శివుని పవిత్ర “కైలాస” శిఖరం దర్శనం అయింది. తన్మయులమయి చూసి ఆనందంతోగెంతులేసాము. ప్రాణవాయువు అక్కడ చాలా తక్కువ వుంటుందనేది అక్కడ కొంచెం  మొదలయింది. కొద్ది దూరం నడుస్తే కొంచెం  ఆయాసం అనిపించింది. ఆరాత్రికి అక్కడే మా నేపాలీ వంటవారు చేసిన భోజనం చేసి విశ్రమించాము. ఆ వాతావరణం లో త్రాగ డానికి వీలుగా మా వంట వాళ్ళు ఎప్పటి కప్పుడు వేడి నీళ్ళు అందించేవారు.  ఆ రాత్రి 12 గం. లకు  మేల్కొని మానస సరోవరం లో జ్యోతి రూపం లో దేవతలు వచ్చి స్నానం చేసి వెళతారనదానికి నిదర్శనం గా మాకు ఆ సరస్సు లో 6 -7 జ్యోతి రూపాలు కనిపించేయి. కొంత సేపటికి కొన్ని మాయం అయ్యాయి.  అవి చూసి మా జన్మధన్యమయింది అనుకున్నాము.
యాత్ర 6 వ రోజు: 23 – 08 – 2015.
            ఉదయమే మా అందరినీ లేపుతూ మా నేపాల్ వంట వాళ్ళు కాఫీ, టీ, ఫలహారాలు అందించారు. గురూజీ వెంట వచ్చిన  పురోహితుడు శ్రీ గురురాజ ఉదయం 9 గం. లకు మా అందరి గోత్ర నామాలు వ్రాసుకుని మా అందరిచేతా సంకల్పం చెప్పించారు. తరువాత అందరం మానస సరోవరం లో స్నానాలు చేశాము. మా పాపాలన్నీ పాటా పంచలయ్యాయని అనిపించింది. కలలో కూడా ఊహించ లేని మధురాతి మధుర మయినది ఆ క్షణం. ఆ ఆనందం మాటల్లో వర్ణించ లేనిది. స్నానాలు అయ్యేక మా పురోహితుడు చనిపోయిన చుట్టాలకు, మిత్రులకు తిల తర్పణాలు ఇప్పించారు. మా తల్లి తండ్రులు, బంధువులు ఎంత పుణ్యం చేసుకున్నారో కదా!
           ఆ తరువాత మా చేత నూతన ఉపవీత ధారణ చేయించారు. మానస సరోవరం ఒడ్డున “సంధ్యావందనం”చేసు కోవాలనే నా  కోరిక ఆరోజు నెరవేరింది. తరువాత మా అందరి చేత  మానస సరోవరం ఒడ్డున మా గురూజీ ఆద్వర్యం లో మా పురోహితుడు “సర్వ దేవతా హోమం,నక్ష త్ర హోమం చేయించారు.  కైలాస పర్వతానికి అభిముఖంగా కూచుని  365 వత్తుల తో నెయ్యి దీపం వెలిగించి స్వామికి నివేదన చేశాము.పరమ శివుడుండే కైలాస గిరికి  అభిముఖంగా దీపం వెలిగించే అదృష్టాన్ని తలచుకొని పొంగి పోయాము. మధ్యాహ్నం 2 గం. లకు హోమాదులు ముగించుకొని భోజనం చేసి విశ్రమించాము. ఆ సాయంత్రం మా పురోహితుడు మా బస లోనే ఆ సరోవరం ఒడ్డున అన్నవరం నుండి తెప్పించిన స్వామి డాలరు, పసుపు బట్ట ఇచ్చి మా అందరిచేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు .ఎంత పుణ్యమో కదా!
            భోజనం చేసి ఆ రాత్రికి (రెండో రాత్రి) మానస సరోవర్ ఒడ్డునే విశ్రమించాము.
యాత్ర 7 వ రోజు: 24 – 08 – 2015.
           ఉదయమే లేచి మేము  తిరిగి మానస సరోవరం లో స్నానం చేసాము. రెండో రోజు కూడా అక్కడ సంధ్యావందనం చేసుకొనే భాగ్యం భగవంతుడు కల్పించాడు. ఆ తరువాత అందరం అల్పాహారం తీసుకుని కైలాసగిరి పరిక్రమకు “బేస్ కాంప్ “ అయిన “డార్చెన్” అనే వూరికి బయలు దేరి 12 గం. లకు చేరాము. భోజనం చేసి అక్కడే పరిక్రమ చేసే  వాతావరణానికి మన శరీరం adjust అవడానికి వీలుగా విశ్ర మించాము. స్వామి వారి కైలాస గిరికి అతి దగ్గర ప్రాంతం డార్చెన్. అక్కడ నుండి స్వామి వారి కైలాస గిరి ఎంతో ఉన్నతం గా కనిపించింది. స్వామి వారికి నమస్కరించుకొని ఆనంద పరవసుల మయ్యాము.
యాత్ర 8 వ రోజు: 25 – 08 – 2015.
            ఉదయం 6 గం. లకు అందరం స్నానాలు ముగించుకొని గురూజీ తో రుద్రాబిషేక పూజలు చేసుకొని  అల్పాహారం తీసుకుని మొదటి రోజు పరిక్రమకు బయలు దేరాము. అరగంట బస్ లో ప్రయాణం చేసిన తరువాత “యమద్వారం” దగ్గరకు చేరుకున్నాము.
 అక్కడ నుండే పరిక్రమ ప్రారంభం. నడిచే వాళ్ళు నడిచి , నడవలేని వాళ్ళు గుర్రాలమీద బయలు దేరారు. అక్కడ నుండి మొదటి రోజు రాత్రి బస చేరే స్థలానికి 18 కి.మీ. మా గ్రూపులో 4 గురు పెద్దవారు పరిక్రమకు రాలేదు. డార్చెన్ లో ఉండిపోయారు. మా గ్రూపులో గురూజీ, ఆయన తమ్ముడు చంద్ర శేఖర్, పురోహోతుడు, 6 గురు రాజుల అమ్మాయిలు, నేను నడుస్తూ బయలు దేరాము. మిగతా వాళ్ళు గుర్రాలపై బయలు దేరారు. పరిక్రమకు బయలు దేరిన వారిలో వయసులో పెద్దవాడిని నేనే. 34 ఏళ్ల గా శబరిమల నడిచిన నా నడక అనుభవం తో నడవగలననే ధైర్యం తో నడక మొదలు పెట్టాను. కొంత దూరం బాగానే నడిచాను. ప్రాణవాయువు చాలా తక్కువ వుండటం తో నా వయసు, శరీరం సహకరించ లేదు. చాలా ఆయాస పడవలసి వచ్చింది. నడకలో అందరి కంటే వెనుక పడ్డాను. ఇద్దరు రాజుల అమ్మాయిలు,పద్మ గారు, రాణిశ్రీ గారు, గురూజీ నాకూడా వుండి కబుర్లు చెపుతూ మొత్తానికి మొదటి రోజు 18 కి.మీ. దూరం  మా రాత్రి బస దగ్గరికి నడిచేటట్లు చేశారు.
          అక్కడ కైలాస గిరి వెనుక భాగం కనిపిస్తుంది. సాయంత్రం 6 గం. లకు అందరం అక్కడ భజనలు చేసి స్వామికి నైవేజ్యం పెట్టి హారతి ఇచ్చాము. మా జన్మ సార్ధకత లభించింది అనిపించింది. ఆ రాత్రి గురూజీ భోజనాలు అయ్యేక “ డాక్టర్ గారూ! రెండో రోజు ఇంకో 2000 అడుగులు పైగా “డోల్మా పాస్” వరకు ఎక్క వలసి వుంటుంది. మీరు ఈరోజు నడకలో పడ్డ ఇబ్బంది గమనించాను. రేపు గుర్రం మీద వెళ్తే మంచిద”ని  సలహా ఇచ్చారు. అనుభవంతో గురూజీ ఇచ్చిన సలహా స్వీకరించి రెండోరోజు “డోల్మా పాస్” వరకు గుర్రం మీద వెళ్లడానికి నిశ్చయించేను. రాత్రి చాలా చలి గా వుంది. ఎవరూ  సరిగ్గా నిద్ర పోలేదు. ఆ రాత్రి  – 5 డిగ్రీలు ఉందిట . 2 అడుగులు నడచినా ఆయాసం వచ్చింది. ప్రాణవాయువు చాలా తక్కువగా వుంది. గురూజీ అనుభవం తో ఇచ్చిన సలహా సరియైన దనిపించింది.
యాత్ర 9 వ రోజు: 26 – 08 – 2015.
         అందరం ఉదయం 6 గం. లకు లేచి కాల కృత్యాలు తీర్చుకుని, అల్పాహారం, కాఫీ తీసుకుని రెండో రోజు పరిక్రమ ఆరంభించేము. ఇంచుమించు 3 – 4 గంటల తర్వాత ఎత్తైన ప్రదేశ మైన “డోల్మా పాస్”  (22,000 అడుగులు) చేరు కున్నాము.
ఆ దారిలో “గౌరికుండ్” కనిపిస్తుంది. అక్కడ నుండి 3000 అడుగులు ఏటవాలుగా క్రిందికి దిగాలి. గుర్రాలు మనుషులతో దిగితే పడిపోతాయి. అందుచే అక్కడ నుండి ఎవరైనా 6 – 7 కి.మీ. ఏటవాలుగా దిగవాల్సిందే.  మధ్యలో ఒక ఫర్లాంగు దూరం ఐస్ లో నడ వాలి. ఏమాత్రం ఏకాగ్రత తప్పినా జారీ పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందరం జాగ్రత్తగా ఒకరికి ఒకరు సహకరించు కుంటూ 12 గంటల ప్రాంతానికి plain ఏరియా కి దిగగలిగేము. అక్కడ చిన్న హోటల్ లో టీ త్రాగి  కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని అక్కడనుండి 12 కి.మీ. నడిచి/గుర్రాల మీద రెండవరోజు రాత్రి బస చేసే చిన్న ఊరికి చేరాము. మా నేపాలీ వంటవారి భోజనం రాత్రికి చేసి అక్కడ విశ్ర మించేము.అక్కడకూడా చాలా చలిగా ఉంది.  రెండవ రోజు పరిక్రమ 22 కి.మీలు.
          కొంతమంది విదేశీయులు “I believe in lord  Siva” అంటూ గౌరికుండ్ లో అంతా చలిలో స్నానం చేసి పూజలు చేశారుట.  అదీ నమ్మకం అంటే. వాళ్ళు నిజమైన భక్తులు.
యాత్ర 10 వ రోజు: 27 – 08 -2015.
             ఉదయమే లేచి, కాల కృత్యాలు తీర్చుకుని కాఫీ/టీ ,అల్పాహారం తీసుకుని తిరిగి మేము బయలుదేరిన చోటుకి అంటే డార్చెన్ కి (12 కి.మీ.) బయలుదేరాము. మూడవ రోజు పరిక్రమ పూర్తి చేసుకుని ఇంచుమించు ఉదయం 11గం.లకు అందరం పరిక్రమ ఆఖరు ఘట్టానికి చేరుకున్నాము. గురూజీ కి నమస్కరించి, ఆనందంతో కేరింతలతో గంతులు వేస్తూ ఒకరిని ఒకరు అభినందించుకున్నాము.
            ఇదంతా ఆ పరమేశ్వరుని కృప, మా గురూజీ శ్రీనివాస్ గారి సంకల్పం, చక్కని ప్రణాళిక వలన ఎంతో అద్భుతంగా జరిగింది. మా ఆనందానికి అవధులు లేవు. డార్చెన్ చేరి అందరం వేడి నీళ్ళ స్నానాలు చేసి, భోజనం చేసి, అక్కడ నుండి తిరిగి మానస సరోవరం వెనుక భాగానికి 4 గం. లకు చేరుకున్నాము. ఆ రోజు అక్కడ మట్టి గదులలో (mud houses) విశ్రమించేము. సాయంత్రం అందరూ అక్కడ మానస సరోవరంలో స్నానాలు చేసి, ఇంటికి పట్టుకెళ్లడానికి నీళ్ళు అక్కడే పట్టుకొన్నాము.
యాత్ర 11వ రోజు: 28 – 08 -2015.
           ఉదయమే అందరం లేచి గురూజీ తో రుద్రాభిషేకం, సుదర్శన హోమం లో పాల్గొన్నాము. అనంతరం కాఫీ, అల్పాహారం సేవించి తిరుగు ప్రయాణం మొదలెట్టాము. దారిలో పురాంగ్ లో కస్టమ్స్ చెక్  అయిన తర్వాత అక్కడే భోజనం చేసి సాయంత్రం 3 గం. లకు చైనా దాటి హిల్సా చేరాము. అక్కడ నుండి మేము సిమికోట్ చేరాలి. కానీ చీకటి పడడం వలన హెలికాప్టర్ లో సగం మంది మాత్రమే ఆరోజు సిమికోట్ చేర గలిగేరు. మిగతా సగం మంది ఆ రాత్రికి హిల్సా లోనే ఒక హోటల్ లో బస చేశాము. అక్కడే సాయంత్రం లలిత, విష్ణు సహస్ర నామ పారాయణాలు చేసుకుని విశ్రమించేము.
యాత్ర 12 వ రోజు: 29 – 08 – 2015.
             ఉదయం అందరం 6 గం. లకు సిద్ధం అయి హెలికాప్టర్ లో 3  ట్రిప్పులలో  సిమికోట్ చేరుకున్నాము. అక్కడ నుండి అందరం “గోమాఎయిర్  వేస్” చిన్న విమానంలో (14 సీటర్) 2 దఫాలుగా నేపాల్ గంజ్ చేరి 1 గంటకు సిద్ధార్థ్ హోటల్ లో  విశ్రమించేము. ఆ రోజంతా మా మానస సరోవర్ యాత్రను తలచుకుంటూ గడిపేము.
యాత్ర 13 వ రోజు: 30 – 08 – 2015.
              ఆ రోజు నేపాల్  గంజ్ లో రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గం లకు “బుద్ధా ఎయిర్ వేస్” విమానం లో అందరం ఖాట్మండు చేరుకుని “సంగ్రీలా” 5 నక్షత్రాల హోటల్ కి 6 గం. లకు చేరుకుని విశ్రమించేము. ఇక్కడితో మాకైలాస్  మానస సరోవర యాత్ర ముగిసి, నేపాళ్ ముక్తి నాథ్ యాత్ర మొదలయింది. నేపాల్ ముక్తినాథ్ యాత్రకి 26 మంది సిద్ధం అయి, మిగతావారు హైదరాబాద్ వెళ్ళి పోయారు.


యాత్ర 14 వ రోజు: 31 – 08 – 2015.
               హోటల్ సంగ్రీలా లో ఉదయం అల్పాహారం ముగించి 8 గం. లకు నేపాల్ లో “మనోకామన” అమ్మ వారి గుడికి ఏ. సి. బస్ లో బయలు దేరాము.   మధ్యాహ్నం 12.30 ని.లకు అమ్మవారి కొండ దగ్గరకు చేరి అక్కడ భోజనం చేసి “రోప్ వే” (5 కి.మీ.)లో కొండ పైకి వెళ్ళి అమ్మ వారి దర్శనం చేసుకున్నాము. భూకంపం వలన ఆ గుడి కూలిపోతే ,పక్కనే అమ్మ వారి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నారు. అక్కడ పూజలు చేయించుకుని 3.30ని.లకు క్రిందకు దిగి ముక్తినాథ్ యాత్రకు “పోక్రా”అనే వూరికి బయలుదేరాము. పోక్రా కెళ్లే త్రోవలో బాగా వర్షం పడింది. ముక్తినాథ్ యాత్ర వాతావరణం సహకరిస్తేనే ఉంటుంది. వర్షం రావడంతో భయం వేసింది. వాతావరణం బాగు లేక పోతే కొన్ని రోజులపాటు  ముక్తినాథ్ యాత్రకు వీలవదని విని ఆందోళన చెందేము. కానీ మా గురూజీ మాత్రం తెల్ల వారేసరికి అంతా సర్దుకుంటుందని ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. అందరం 7.30 ని.లకు పోక్రా చేరి అక్కడ “పెనింసులా” అనే హోటల్ లో బస చేశాము. గురూజీ అన్నట్లే తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది.
యాత్ర 15 వ రోజు: 01 -09 – 2015.
            అందరం ఉదయం 6 గం. లకు కాఫీ  తీసుకుని పోక్రా విమానాశ్రయాని కి చేరాము. పోక్రా నుండి  “జాంసం”  అనే వూరు విమానం లో చేరి అక్కడ నుండి చిన్న బస్ లో 35 కి.మీ. వెళ్తే ముక్తినాథ్ వస్తుంది. పోక్రా నుండి జాంసమ్ వాతావరణం క్షణాలలో మారిపోతూ వుంటుంది. విపరీతమైన గాలి వచ్చి విమానాలు వెళ్లలేవు. 7 గం. లకు.వాతావరణం బాగుందని మాకు “సెక్యూరిటి” చెక్ చేసి లోపలికి పంపేరు. 15 ని.లలో వాతావరణం బాగు లేదని మళ్ళీ బయటకు పంపేరు. ముక్తినాధుని దర్శన భాగ్యం లేదనుకున్నాము. మళ్ళీ 8గం.లకు వాతావరణం బాగుందని కబురొచ్చింది. వెంటనే అక్కడ మా కోసం రెడీ గా వున్న “సింరిక్ ఎయిర్ వేస్”  చిన్న విమానం (14 సీటర్) ఎక్కి 20 నిముషాలలో జాంసమ్ విమానాశ్రయం చేరాము. రెండో ట్రిప్ లో మా గ్రూపులో మిగిలిన వాళ్ళని తీసుకొచ్చింది . జాంసం లో “మెజెస్టిక్ గెస్ట్ హౌస్” లో దిగి కాఫి, టిఫిన్ తీసుకుని చిన్న వాన్ లో ముక్తినాథ్ కి బయలు దేరాము. “గండకి’ నది ఒడ్డున 35 కి.మీ. ప్రయాణం చేసి ముక్తినాథ్ చేరాము. దగ్గరలో (3 కి.మీ.) చిన్న గుట్ట పైన ముక్తినాథ్ ఆలయానికి  నడిచి చేరుకొనే సరికి మధ్యాహ్నం 12 గం.లు అయింది.
            అక్కడ 108 ధారలు , ఆ వాతావరణం చూసి పులకరించి పోయాము. 108 ధారలు కాకుండా అక్కడ కర్మ ధార, ముక్తి ధా ర వున్నాయి. ముందుగా 108 ధారలలో స్నానం చేసి తరువాత కర్మ ధార ,ముక్తిధారలలో స్నానం చెయ్యాలి.  మేము ఆరకంగా 3 సార్లు స్నానం చేశాము. నెత్తి మీద నీళ్ళ ధారలు పడుతూ వుంటే, తల గడ్డ కట్టినట్టు అయి పోయేది. నీళ్ళు అంతా చల్లగా వున్నాయి. మా కుటుంబ సభ్యులందరి పేర్లు గోత్ర నామాలతో వ్రాసిన తెల్ల బట్ట నెత్తి మీద పెట్టుకుని ఆ పవిత్ర స్నానం చేశాము. (అలా చేస్తే కుటుంబ సభ్యులందరికి పుణ్యం వస్తుందని మా స్నేహితుడు చెప్పారు).  ఆ తరువాత అందరం బట్టలు మార్చుకుని శ్రీ ముక్తినాధుని దర్శనం చేసుకున్నాము. జీవితం లో ఎప్పుడైనా ఇటువంటి భాగ్యం కలుగు తుందా అనే భావం వుండేది. అటువంటి భాగ్యం ఆరోజు మాకు లభించింది. మా అదృష్టం ,మాకు ఒక్క రోజులో స్వామి దర్శన భాగ్యం లభించింది. చాలా మంది వారం రోజులు వేచిఉన్నా ప్రతికూల వాతావరణం వలన దర్శనం లభించదట. మాపై ముక్తినాధునికి అపారమైన అనుగ్రహం ఉంది.
              తృప్తిగా దర్శనం చేసుకుని ముక్తినాథ్ వూరిలో కమ్మని భోజనం చేసి కొన్ని  “సాలిగ్రామాలు” కొనుక్కొని సాయంత్రం 6 గం.లకు తిరిగి జాంసం చేరుకొని గెస్ట్ హౌస్ లో విశ్రమించేము. ముక్తినాథ్ “అన్నపూర్ణ” రేంజ్ హిమాలయ శ్రేణులలో ఉంది.
యాత్ర 16 వ రోజు:  02 – 09 – 2015.
             ప్రొద్దున్నే 6 గం. లకు లేచి 200 గజాల దూరం లో ఉన్న జాంసమ్ విమానాశ్రయానికి చేరుకున్నాము. వాతావరణం సహక రించడం వలన 2 దఫాలుగా మేమందరం తిరిగి  9 గం.లకు పోక్రా చేరుకున్నాము. జీవితం  లో మా ముక్తినాథ్ యాత్ర మరచి పోలేని ఒక మధురానుభూతి. పోక్రా లో కాఫీ, ఫలహారం తీసుకొని , అక్కడ వున్న  గుప్తెశ్వర్ మహాదేవ్, వింధ్య వాసిని అమ్మవారు, సరస్సు మధ్యన ఉన్న వారాహి అమ్మవారు దేవాలయాలకు వెళ్ళాము. మధ్యాహ్నం 1.30 ని.లకు తిరిగి వచ్చి భోజనం చేసి ఆరోజుకు అక్కడే విశ్ర మించాము. పోక్రా ఒక టూరిస్ట్ సెంటరు. చాలామంది విదేశీయులు వచ్చి అక్కడ “గ్లైడింగ్ , ట్రెక్కింగ్” చేస్తూ వుంటారు.
యాత్ర 17 వ రోజు: 03 -09- -2015.
              ఉదయం కాఫీ, ఫలహారం తీసుకుని 12  గం.లకు పోక్రా విమానాశ్రయం నుండి బయలుదేరి “బుద్ధా ఎయిర్ వేస్” లో  ఖాట్మండు 2 గం.లకు చేరి భోజనం చేసి “సంగ్రీల”హోటల్ నుండి “గోకర్ణ ఫారెస్ట్ రిసార్ట్” కి మారిపోయాము. అది అడవిలో “లేళ్ళ” మధ్యన ప్రకృతి వొడిలో అందమయిన వాతావరణం లో వుంది. సాయంత్రం 6 గం. లకు అందరం పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం , హారతి దగ్గరనుండి చూసి ఆనంద పరవసులమైనాము.రాత్రికి గెస్ట్ హౌస్ లో విశ్రమించేము.
యాత్ర18 వ రోజు: 04 – 09 – 2015.
              ఉదయమే లేచి స్నానాదులు ముగించుకుని ఖాట్మండులో ఉన్న దక్షిణ కాళి ఆలయం, స్వయంభూనాథ్ భౌధ్ధ ఆరామం, చూసి, భోజనం చేసి, 3 గం..లకు బుద్ధ ఎయిర్ వేస్ విమానం లో “జనక్ పూర్” (మిధిలా నగరం) 4.30 ని.లకు చేరాము. నేపాల్ లో రాజకీయ కారణాల వలన అక్కడ “ధర్నాలు” జరుగుతున్నాయి. రిక్షాలలో మేముండవలసిన “సీతా శరణ్” హోటల్ చేరుకుని స్నానాదులు ముగించి, “జానకి మహల్,  గంగా హారతి” చూసి మా హోటల్ కి వచ్చి విశ్రమించేము.
యాత్ర 19 వ రోజు: 05 – 09 - 2015.
              ఉదయమే స్నానం, ఫలహారం చేసి మళ్ళీ జానకి మహల్ కి వెళ్ళి హారతి చూసి, సీతారాముల కళ్యాణం జరిగిన స్థలం చూసి, రామ మందిర్, సంకట మోచన్ హనుమాన్ ఆలయాలు దర్శించుకుని 10.30 ని.లకు హోటల్ చేరుకున్నాము. శివ ధనుర్భంగం జరిగి నపుడు, శివుని విల్లు లో ఒక భాగం 20 కి.మీ. దూరం లో పడిందిట (ధనుష్కోడి). అక్కడ ధర్నాల మూలంగా “ఆటో” వంటి సాధనాలు దొరకక వెళ్ల లేక పోయాము. శ్రీ రాముల వారి అనుగ్రహం లేదు. మధ్యాహ్నం భోజనం చేసి  రిక్షాలలో 3 గం.లకు జనక్ పూర్ విమానాశ్ర యానికి చేరి, బుద్ధా ఎయిర్ వేస్  విమానం లో  ఖాట్మండు సాయంత్రం 6 గం. లకు చేరుకుని మా గోకర్ణ గెస్ట్ హౌస్ లో విశ్ర మించేము.
యాత్ర 20 వ రోజు: 06 – 09 – 2015.(ఆఖరి రోజు).
              ఉదయం 6 గం.లకు లేచి స్నానాదులు ముగించుకుని, పశుపతి నాధునికి అభిషేకం చేయించు కొని , లక్ష వత్తులు వెలిగించు కోవదానికి 7 గంటలకు పశుపతి నాథ్ ఆలయానికి బయలుదేరి వెళ్లాము. దారిలో గోకర్ణేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఒక అమ్మ వారి శక్తి పీఠం (అమ్మ వారి మూత్ర సంచి అక్కడ పడిందట). చూసుకొని, పశుపతినాథ్ ఆలయం చేరుకొని స్వామికి చక్కగా అభిషేకం చేయించుకుని , లక్ష వత్తుల నెయ్యి దీపాలను వెలిగించు కుని 11.30 ని.లకు హోటల్ చేరుకుని ఒక గంట విశ్రాంతి తీసుకుని, భోజనం చేసి 1.30 ని.లకు ఖాట్మండు విమానాశ్రయానికి బయలుదేరాము. మా డిల్లీ విమానం సాయంత్రం 4 గం.లకి. 2 గం. లకు సెక్యూరిటీ చెక్ అవగానే బొర్డింగ్ పాస్ తీసుకుని 4 గం. లకు  బయలుదేరి 5.15ని.లకు డిల్లీ చేరాము. డిల్లీ నుండి 8.25 ని.లకు బయలు దేరి 10.30 ని.లకు హైదరాబాద్ చేరుకున్నాము. లగేజ్ తీసుకుని మిత్రులందరికి వీడుకోలు చెప్పి రాత్రి 12 గం. లకు ఇల్లు చేరుకొన్నాము. మా కైలాస మానస సరోవర యాత్ర అంతా ఒక కలలాగ అనిపించింది. మేమే ఈ యాత్ర చేయగలిసామా అనిపించింది. అంత కస్టమైన యాత్ర పరమేశ్వరుని కృప తో , గురూజీ  పట్టుదల, చక్కని ప్రణాళిక తో  ఈ యాత్ర చేయగలిసేము. ఒక హిందువు గా పుట్టిన వాడికి ఇంతకన్నా కావాల్సినది ఏముంటుంది?. బ్రతికినంతకాలం మా కైలాస మానస సరోవర, నేపాల్ ముక్తినాథ్ యాత్ర మా మనసులలో కదలాడుతూ వుంటుంది.
                                                       ***  హర హర మహాదేవ శంభో శంకర ***



       



                        మా శ్రీ లంక రామాయణ యాత్ర
                మమ్మల్ని మానస సరోవర్ యాత్ర కి తీసుకెళ్లిన శ్రీ నివాస్ గురుజీ ఒకనాడు ఫోన్ చేసిడాక్టర్ గారూ! శ్రీలంక రామాయణ యాత్రకి వస్తారా?” అని అడిగేరు. అంత వరకు భారత దేశం లో రామాయణం లో వర్ణించిన చాలా స్థలాలు గత ఐదు సంవత్సరాలలో చూడ గలిగాము ( అయోధ్య,  జనకపురి (మిదిల), మానస సరోవరం, నైమిశారణ్యం, చిత్రకూటం, కాశీ, గంగానది, ప్రయాగ, భరద్వాజ ఆశ్రమం,  నాసికాత్రయంబకం, పంచవటి, దండకారణ్యం, గోదావరి, పర్ణశాల, కిష్కింధ, ఋష్యమూక గిరి, పంపానది, అంజనాద్రి, మహేంద్ర గిరి, రామేశ్వరం, ధనుష్కోటి, సేతువు  మొదలయినవి ) .
                గురుజీ శ్రీలంక రామాయణ యాత్ర అనగానే,  శ్రీలంకలో జరిగిన రామాయణ ఘట్టాల స్థలాలు కూడా చూసే అవకాశం శ్రీరామచంద్రుడే కల్పించాడని తలచి వెంటనే మేమూ వస్తామని సంతోషం గా చెప్పాను.
                శ్రీ  యెమ్. యెస్. రామా రావు ట్రస్ట్   ఆధ్వర్యం లో  శ్రీ పోలాప్రగడ  శ్రీనివాస్ గురూజీ నాయకత్వం లో మా శ్రీలంక రామాయణ యాత్ర 2016 మార్చ్ నెల పందొమ్మిదవ తేదీన మొదలయింది .
మొదటి రోజు: ( 19 03 - 16)
             హైదరాబాద్ లో ఉదయం  5.35 ని కి విమానంలో బయలు దేరి మదరాసు మీదుగా శ్రీలంక లో కొలంబో విమానాశ్రయం  ఉదయం 10.50 ని. కు చేరుకున్నాము. కొలంబోలో భోజనం చేసి చిలావ్ బీచ్ రిసార్ట్ కి బయలుదేరాము. దారిలోమదంపేఅనే ఊరులో మురుగన్ దేవాలయం దర్శించుకున్నాము . తరువాత మున్నేశ్వరం అనే ఊరులో "మున్నేశ్వరుని" దర్శించుకున్నాము. అక్కడికి రెండు మైళ్ళ దూరంలో  మనవరి శివాలయాన్ని (రామలింగేస్వరుడు) చూసేము. ఇది సైకత(మనవరి) లింగం. శ్రీ రామచంద్రుడు  రావణ వధానంతరం బ్రహ్మహత్యా దోష నివారణార్ధం మొదట ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించాడ ని ఇక్కడ చెపుతారు. తరువాత రామేశ్వరం లో ప్రతిష్టించాడట. సాయంత్రం  ఐదు గంటలకు చిలావ్ బీచ్ రెసార్ట్ చేరి రాత్రి అచ్చట విశ్రమించాము. 
రెండవ రోజు:  (20 03 - 16)
             ఉదయం 8 గంటలకు ట్రింకోమలి కి బయలు దేరాము. దారిలో  రావణుడు కైకసి తర్పణాల కోసం నీరు దొరకకపోతే శూలంతో గుచ్చి చేసిన 7 వేడి నీటి బావులుచూశాము.అక్కడ నుండి  సముద్రపు అంచులో చిన్న కొండపై ఉన్నకోనేశ్వర్ శివాలయందర్శించుకొన్నాము. ఇక్కడ శివుని పేరు  “కోనేశ్వరుడు”. అమ్మ వారి పేరుమాధురి అమ్మన్”. ఈమెనే భారత దేశంలోశాంకరి మాతఅని పిలుస్తారు . ఆష్టా దశ శక్తి పీఠాలలో మొదటిది. అక్కడ అమ్మవారికి అందరం పూజలు చేయించుకొని చీరలు సమర్పించుకొని సాయంత్రం ఏడు గంటలకు ట్రింకోమలీ  సముద్ర తీరాన గల రిసార్ట్ లో  రాత్రికి విశ్రమించాము.

మూడవ రోజు : (21 -03 16)
             మూడవ రోజు ఉదయం 8 గంటలకు జాఫ్నా వైపు బయలుదేరాము. అక్కడ చాలా ద్వీపములు ఉన్నాయి. అందులో నాగ ద్వీపమొకటి. అక్కడ నాగదేవతసురసకు పెద్ద గుడి కట్టారు. ఆంజనేయ స్వామి సముద్రమును లంఘిచు సమయాన దేవతలు  స్వామి శక్తిని పరీక్షించ మని నాగమాత సురసా దేవిని కోరగా,  సురసా దేవి యోజన ప్రమాణాన నోరు తెరిచి స్వామి దారి కి అడ్డు నిలిచినిను మింగెదననితెలుప స్వామి సూక్ష్మ రూపాన ఆమె నోట దూరి బయటకు రాగా ఆమె మెచ్చు కొని ఆశీర్వదించి సీతాన్వేషణకు తరల మనుచు పంపినది. ఆంజనేయ స్వామికి సురసా దేవి అడ్డు గా నిలచినది యీ స్థలమని ఇక్కడ ఆమెకు గుడి కట్టారు . రాత్రికి జాఫ్నా లోని నల్లూర్ అనే ప్రాంతం లో విడిది చేశాము.
నాల్గవ రోజు : (22 03 16)
               నాల్గవ రోజు ఉదయం 8 గంటలకు నల్లూరులో   నల్లూర్ కందస్వామిఅని పిలువబడేమురుగన్ఆలయానికి వెళ్ళేము. గుడి చాలా పెద్ద ఆవరణలో ఉంది . చాలా అందంగా ఉందిసుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చాలా చిన్నది.  అక్కడనుండి "ఫత్తుని  అమ్మన్" అనే అమ్మవారి గుడిని నల్లూరు లో దర్శించుకొని "దంబుల్లా" అనే ప్రాంతానికి తరలి వెళ్లాము. అక్కడ ప్రపంచం లోనే అతి పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. దాని ఎత్తు 100 అడుగులు. బంగారు ఛాయలో ఉంటుందిఅక్కడనే కొండ మీద 2000 సం.నాటి బౌద్ధ గుహలు 5 ఉన్నాయి. వాటిలో చాలా బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. రాత్రికి దంబుల్లా లోనే బస చేశాము.
దవరోజు : (23 - 03 - 16)
               ఉదయమే 8 గంటలకు "కాండీ" అనే ప్రాంతానికి బయలు దేరాము. దారిలో "మసాలా దినుసులతోట (స్పైస్ గార్డెన్) ను చూసుకొని అక్కడ నుండి కాండీ కి బయలు దేరాము. కాండీ అనే ప్రదేశములో  "నీలి రాళ్ళు" (బ్లూ సఫ్ఫైర్గనులు ఉన్నాయి. అక్కడ ఉన్న పెద్ద నీలి రాళ్ళ వర్తక కేంద్రాలను చూసాము. చాలా రకాల నీలి రాళ్ళు , తెల్ల రాళ్లు మొదలగు రాళ్ళతో చేసిన ఆభరణాలు కన్నులకు విందు చేశాయి. సింహళ ద్వీపం లోనే అతి పెద్ద బౌద్ధ ఆరామం కాండీ లో ఉంది. బుద్ధుని శరీర భాగాలలోని "పన్ను" ని అచ్చట ఉంచారటభారత్ లోని కళింగ దేశం నుండి హేమమాల అనే రాకుమారి 314 డి .లో బుద్ధుని పన్నుని అక్కడకు తెచ్చిందని అక్కడ వారు చెప్పారు ఆరామం లో బుద్ధుని బంగారు విగ్రహం ఉంది. చాలా బాగుంది. ఎంతో మంది విదేశీయులు అక్కడ కనిపించారు రాత్రికి అక్కడే బస చేశాము.
ఆరవ రోజు: (24 -03 - 16)
                 ఆరవ రోజు ఉదయమే బయలు దేరి "రంబోడా" అనే ప్రాంతం చేరాము. ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని వెదక డా నికి లంకలో మొదట గా కాలుమోపిన స్థలమది అని అక్కడ చెబుతారుఅక్కడ శ్రీ చిన్మయ మిషన్ వారు హనుమంతుని గుడి కట్టి 16 అడుగుల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు (2001 లో). మేము అక్కడకు చేరిన రోజు ఆంజనేయస్వామికి విశేష మైన పూజలు చేస్తున్నారు. రోజునే హనుమ సీతా మాతకు రాముల వారిచ్చిన "ఉంగరం" యిచ్చారని అందుకే విశేష పూజలని చెపితే మా ఆనందానికి అంతు లేదు. అంతా శ్రీ రాముల వారి అనుగ్రహంఅక్కడే ఉన్న కాంటీన్ లో చక్కని భోజనం చేసి "నువార ఇలియ" (సీతా ఇలియా అని కూడా అంటారు) అనే ప్రాంతానికి బయలు దేరాము. రంబోడా , నువార ఇలియా ప్రాంతమంతాఅశోకవనంఅని పిలుస్తారు. శింశుపా వృక్షం క్రింద ఒక  సంవత్సరం కాలం సీతమ్మ నుంచిన స్థలం చేరాము. అక్కడ సీతమ్మ వారికి రామ, లక్ష్మణ హనుమ సమేతంగా గుడి కట్టారు. గుడి వెనుకే చక్కని సెలయేరు పారుతోంది .సీతమ్మవారు రోజూదానిలో  స్నానంచేసేవారట.  అక్కడే ఆంజనేయస్వామి పెద్దవి, చిన్నవి   పాద ముద్రలు ఉన్నాయి. ప్రాంత మంతా చాలా చల్లగా ఉందిఅంత వరకు మేము తిరిగిన ప్రదేశ మంతా చాలా వేడిగా ఉంది. సింహళం లో అతి ఎత్తైన ప్రదేశం అది అని గైడ్ చెప్పాడు. గుడిలో శ్రీ యెమ్. యెస్. రామారావు గారి మనుమడు, హనుమదుపాసకులు గురుజీ శ్రీ పోలాప్రగడ శ్రీనివాస్ గారు "సుందర కాండ" లోని కొన్ని భాగాలు మృదు మధురంగా పాడగా విని మేమంతా తన్మయుల మయ్యాము. గుడిలో మేము, చాలా మంది మా గ్రూపులో వాళ్ళు అమ్మవారికి చీరలు సమర్పించి పూజలు చేయించు కున్నాముఅక్కడ నుండి దగ్గరలో గల "గాయత్రి" అమ్మ వారి గుడికి వెళ్లాము. పెద్ద ఆవరణలో గుడి ప్రశాంతంగా చాలా బాగుంది. స్థలంలోనే ఇంద్రజిత్తు పరమశివుని కై తపమొనరించాడని  చెప్పారు.
               అక్కడ నుండి బయలుదేరి దగ్గరలోనే గల సీతమ్మవారు "అగ్ని ప్రవేశం" చేసిన ప్రదేశం చేరు కొన్నాము. సీతమ్మ వారి అగ్ని ప్రవేశం తలుచు కో గానే చాలా బాధనిపించిందిఅక్కడే ఒకే చెట్టు బోదె లో చెక్కిన గుండెలు చీల్చి సీతా రాములను చూపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. అశోకవనం లో సీతమ్మ వారి గుడి, అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన స్థలం చూసి మనసంతా తెలియని బాధ తో రాత్రికి "నువార ఇలియ" లో బస చేశాము. అక్కడ రాత్రి చాలా చలి గా ఉంది. అక్కడ హోటల్ లో పంఖా కానీ, సి కానీ లేదు. అంటే అక్కడ ఎప్పుడు చాలా చల్లగా ఉంటుందన్న మాట. అంత చలి లో సీతమ్మ వారు  ఎలా వున్నారో  తలుచు కుంటె ఎంతో బాధనిపించింది . శ్రీ లంక లో ఆరోజు మాకు ఆఖరు రాత్రి. అంటే మా యాత్ర ముగింపు కొచ్చిందన్నమాట.
ఏడవ రోజు :(25 -03 - 16)
               రామాయణ ఘట్టాలను చూసి శ్రీలంక నుండి తిరుగు ప్రయాణం అయే రోజు. ఉదయం 5 గంటలకే బయలుదేరి  10.50 ని కు కొలంబో విమానాశ్రయం చేరుకొన్నాము. అక్కడనుండి మదరాసు మీదుగా హైదరాబాద్ రాత్రి 8. 10 ని కి చేరుకొని ఇల్లు చేరు కొనేసరికి రాత్రి 9.45 ని అయింది.
              మా గ్రూపులో మొత్తం 31 మందిమి ఉన్నాము. దానిలో ముగ్గురు లండన్ నుండి వచ్చి మాతో "కొలంబో" లో కలిసేరు. అందరం ప్రయాణంలో భక్తి పాటలతో, భజనలతో, జోకులతో సరదాగా ఒక కు టుంబంలా ఆనందంగా గడిపాము. గురుజీ రోజూ ఉదయమే శివునకు, హనుమకు అభిషేకం చేసేవారు. అందరం అందులో పాల్గొనే వాళ్ళంలండన్ నుండి వచ్చిన మూర్తి గారు, వారి సతీమణి శారద గారు, రమేష్ గారు తిరిగి కొలంబోలో మాతో విడివడి లండన్ తిరిగి వెళ్ళిపోయారు. యాత్ర కొచ్చిన అందరూ ఎంతో ఆధ్యాత్మిక చింతన గలవారే. మా గ్రూపులో నలుగురు తప్ప అందరూ గురూజీతో మానస సరోవర్ యాత్రకు వచ్చినవారే.


              మా శ్రీలంక రామాయణ యాత్ర అంతా ఒక కలలా అనిపించింది . జన్మలోనో చేసుకున్న పుణ్యం వలన వెళ్లగలిగాము                        అంతా శ్రీ రాముల వారి కృప. ఇంత మంచి యాత్ర మాచే చేయించిన గురుజీ శ్రీనివాస్ గారికి సుమాంజలులు.
                                    జై శ్రీరామ్.    జై శ్రీరామ్జై శ్రీరామ్.                                   


 munneswaralayam


 Manavari(సైకత) Siva temple


 Koneswar/శాంకరిశక్తిపీఠం


Sankari matha temple


Morning Abhishekam


Abhishekam


On the way to Nagadweep(Surasa temple)


Surasa Devi temple


Surasa Devi Temple


Nallur Murugan Temple


Dambulla


Morning Abhishekam


Ramboda Hanuman Temple


Ramboda Hanuman


In Asokavanam








              


About the Blog

 
Welcome to this blog of the descendants of Sri Mahabhashyam Narasimham of Vizianagaram .
Our ancestors hail from Gazulapalle , Kurnool District. They were Sanskrit scholars . One of them , Seshadri Sastri went to Benares to prosecute his higher studies. On his return journey , the then Maharajah of Vizianagaram detained him in Vizianagaram and appointed him as the Asthana Pandit.His erudition was so great , particularly his commentary on Sankara's works , that he was conferred the title "Mahabhashyam" which subsequently became the surname of the family . Our original surname was "Rudraksha"
QRCode

post slideshow

Loading...