శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిధ్ధించుట నాకెన్నటికో
శ్రి గురు పాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో
మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరియని హరి నామామృత పానము జేసేదెన్నటికో.
కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో.
పంచాక్షరి మంత్రము మదిలో పఠియించుట ఇంకెన్నటికో
ఆది మూర్తి శ్రీ అమర నారేయణ భక్తుడనయ్యేదెన్నటికో.
0 comments:
Post a Comment