కన్నుల కగబడ వెందుకొ!
కన్నా
నేనెరిగితి! నిను కాంచిన నాయీ
కన్నులు నిలుచున!
ఒసగుము!
కన్నా ! నిను
చూడగలుగు! కన్నులు నాకున్
సుందరుడా
హనుమంతుడు!
అందరి హృదయము
లనుండు అంజని సుతుడున్!
సుందర కాండము
చదివిన!
అందరికిని శుభము
కలుగు ఆతని దయతో!
నాలో యుండెడి
దైవము
నీ లోపల
యుండగలడు! నిక్కువ మలరన్
ఇలలో దైవము ఎచటని
ఆలోకము చేసి చూడ!
అంతట యుండున్!
శరణు! శరణు!
గోవిందా!
వరములు నాకేమి
వలదు! పాపవినాశా!
హరి!హరి! యను నీ
నామము
నిరతము నా నోట
నిలచి నెప్పుకొన వలెన్!
ఆలి గుండె నిండ!
అమ్మ అవతలంట!
తల్లి మాట ఎత్త
తంట యింట!
ఎంత వార లైన కాంత
దాసులు కార!
రామకృష్ణ మాట రాచ
బాట!
నచ్చి నట్టి
పనిని నవ్వుతూ చేతురు!
కష్ట మయిన కొంత
నష్ట మయిన
ఇష్ట మయిన కాద
ఇంగువ బెల్లము
రామకృష్ణ మాట రాచ
బాట!
తల్లి దినమ టంచు!
తండ్రి దినమ టంచు!
తల్లి దండ్రుల
నిల తలచు యువత!
మాత పితల సేవ
మరచి పోయిరికదా!
రామకృష్ణ మాట రాచ
బాట!
సిరి గల మనుజుని
చుట్టును
పరిజనములు చేరి
నతని వందింతు రిలన్!
పరివర్జింతురు
నాతని
సిరిపోవగ
నామనుజుని చింతయె లేకన్!
పదవి లోన యున్న
వందల సంఖ్యలో!
భజన పరులు చేరి
ప్రస్తు తించు!
పదవి పోయి నాక
పలుకరు ఒక్కరూ!
రామకృష్ణ మాట రాచ
బాట!
పరుల సొమ్ము
కొరకు ప్రాకు లాడకునీవు!
దక్కు న్యాయ మైన
ధనము నీకు!
పాము వంటి దిలను
పాపము సొమ్మురా!
రామకృష్ణ మాట
రాచబాట!
ఆదరింపు లేని
అన్ని విద్యలు కూడ!
వ్యర్ధ మగును
యిలను వాసి లేక!
గోడ దాపు వలయు
(గోల్డు) పైడి పళ్ళెముకైన!
రామకృష్ణ మాట రాచ
బాట!
నీదు కోప మెపుడు
నినుదిగ జార్చును!
శాంత మిచ్చు నీకు
సంత సంబు!
కోపమిల మనిషికి
శాపంబు గా మారు!
రామకృష్ణ మాట రాచ
బాట!
నీవు చెప్ప వచ్చు
నీతు లెన్నయినను!
ఆచ రించి చూపు
ఆది లోనె!
చేతకాని యపుడు
చెప్పకు నీతులు
రామకృష్ణ మాట రాచ
బాట!
ఆశ వుండ వచ్చు!
అత్యాశ కూడదు!
తనివి తోడ నీవు
తనర వలయు!
ఆశ లేని వాడు
ఈశుడే ధరలోన!
రామకృష్ణ మాట రాచ
బాట!
నీవు మేలు చేయ
నీటి పై వ్రాయుము!
నీకు మేలు చేయ
నిశ్చయముగ!
రాతి పయిన వ్రాయి
రంజిల్లుచును నీవు!
రామకృష్ణ మాట రాచ
బాట!
ఏమి లేని వాడు
ఎగిరెగిరి పడును!
అన్ని వున్న వాడు
అణగి యుండు!
లేని గొప్ప వలదు దేనికి
కొరగాదు!
రామకృష్ణ మాట రాచ
బాట!
బలము ఉందనుచును
భ్రాంతి పడకు నీవు!
ఎదుటి వాని బలము
ఎరిగి యుండు!
గడ్డి పరక కూడ
గజమును బంధించు!
రామకృష్ణ మాట రాచ
బాట!
కమలాక్షు చూచెడి
కన్ను లీయుము నాకు!
శ్రీ హరిన్ సేవించు చేతు లిమ్ము!
హరిదరి చేర్చెడి
అంగము లీయుము!
హరికి మ్రొక్క గలుగు శిరము నిమ్ము!
నరహరిన్
కీర్తించు నాలుకీయు మునాకు!
విష్ణు కధవినెడి వీను లిమ్ము!
మాధవు ధ్యాసను
మరలించ లేనట్టి!
శక్తి నీయుము నాకు శాశ్వతముగ!
హరికి సేవ చేసి
అలరించ గలిగిన!
దేహ మిమ్ము నాకు
దేవదేవ!
శ్వాస నిండ
స్వామి ధ్యాస యుండు నటుల!
వరము నిమ్ము నాకు
వాసు దేవ!
మందు కొట్టు వారు
మరతు రీ జగమును!
తప్పిదములు చేయు
దర్పముగను!
మందు కొట్టు వాని
మార్గమే వేరురా!
రామకృష్ణ మాట రాచ
బాట!
వాణీ! చతురానన
హృది
రాణీ! కవితా
రసజ్ఞ రాణీ! వీణా
పాణీ! వాగ్దేవీ!
క
ళ్యాణీ! విద్యాధి
నేత్రి! అంజలి కొనుమా!
బుడి బుడి అడుగుల
నడకల
తడబడుచును నంద
సుతుడు తడవాడంగన్!
పడి పడి నవ్వుచు
భామలు
వడి వడిగను వెంట
బడగ పరుగులు తీసెన్
అన్న దమ్ము లుండు
అంతరములు లేక!
రామ లక్ష్మణులుగ
రాగ మలర!
పెండ్లి అయిన తోడ
పెరుగును దూరంబు!
రామకృష్ణ మాట రాచ
బాట!
తడబడు చుండెను
అడుగులు!
వడివడి గను
నడువలేను వార్ధక్యముతో!
ఉడిగెను వినికిడి
కూడను!
వాడి అయిన దృష్టి
పోయె! బ్రతుకుట ఎటులో!
పెదవులపై నీ
వుంటివి!
పదములు నే వెదకు
చుంటి! పంకజ నయనా!
యదు నందన శ్రీ
కృష్ణా!
పదముల కడ
చోటొసగుచు! పాలించవయా!
సహనము చూపిన
వారికి!
ఇహపర సుఖములు
దొరకును ఈప్సిత మలరన్!
అహమును వదలిన
వారిని!
ఆ హరి దరి చేర్చు
కొనును అంత్యము నందున్!
రామ భక్తి రసము
రంగరించుచు పెంచు!
ఉగ్గుపాలతోనె ఊసు
లాడి!
రామ జలధి లోని
రసమును గ్రోలుచు!
రామ విభుని చేరు
రామకమున!
0 comments:
Post a Comment